Glenn Phillips: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament ) ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు… మోస్తారు స్కోర్ చేసింది. దుబాయ్ కండిషన్స్ ప్రకారం భారీ స్కోర్ అని చెబుతున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో.. 7 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 251 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… టీమిండియా పోరాడుతోంది. మొదట్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే గిల్… అద్భుతంగా ఆడారు.
Also Read: Champions Trophy 2025: ఫైనల్స్ లో టీమిండియా గెలిస్తే బట్టలిప్పి తిరుగుతా… హాట్ బ్యూటీ సంచలన పోస్ట్ !
కానీ 31 పరుగులు చేసిన గిల్… న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సంట్నర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే గిల్ క్యాచ్ ను… న్యూజిలాండ్ డేంజర్ ఫీల్డర్.. గ్లెన్ పిలిప్స్ పట్టడం జరిగింది. ఆఫ్ సైడ్ లో… ఫీల్డింగ్ చేస్తున్న పిలిప్స్ కు క్యాచ్ ఇచ్చాడు గిల్. అయితే… ఆ క్యాచ్ను గాల్లోకి ఎగిరి… అందుకున్నాడు ఫిలిప్స్. న్యూజిలాండ్ లోనే… అత్యంత డేంజర్ ఫీల్డర్ గా ఫిలిప్స్ కు మంచి పేరు ఉంది. మొన్న లీగ్ దశలో న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
అప్పుడు కూడా విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టి ఫిలిప్స్ సంచలనమే సృష్టించాడు. అప్పుడు అనుష్క శర్మతో పాటు గ్రౌండ్లో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఇదెక్కడి క్యాష్ రా నాయనా…? అంటూ షాక్ తిన్నారు. అయితే ఇవాళ ఫైనల్ మ్యాచ్ లో కూడా అచ్చం అలాగే చేశాడు పిలిప్స్. డేంజర్ గా మారుతున్న టీమిండియా ఓపెనర్ గిల్ క్యాచ్ పట్టి… న్యూజిలాండ్ జట్టుకు ఊపిరి పోసాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇలా ఇలా పడుతున్నావు అంటూ… ఫిలిప్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు 135 పరుగులు చేసింది టీం ఇండియా. ఇప్పటికే 30 ఓవర్లు కూడా పూర్తి అయ్యాయి. టీమిండియా గెలవాలంటే మరో 115 పరుగులు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం 30 ఓవర్లకు.. మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 135 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 76 పరుగులకు అవుట్ అయ్యాడు. 83 బంతులు ఆడిన రోహిత్ శర్మ.. 76 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఒకే ఒక్క పరుగుకు అవుట్ అయ్యాడు. బ్రేస్ వెల్ వేసిన అరుదైన బంతికి ఎల్బిడబ్ల్యు అయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ అలాగే అక్షర్ పటేల్… ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు.
Also Reead: Yuzvendra Chahal: దుబాయ్ లో కొత్త ప్రియురాలితో చాహల్ ఎంజాయ్.. షాక్ లో ధనశ్రీ ?
Flying man does it again 😱
What a catch by Glenn Phillips 🫡#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/CXlmPIJpfo
— 𝐊𝐀𝐑𝐍𝐀 🏹🌞🇮🇳 (@Suryaputhra07) March 9, 2025