Niloufer Cafe: హైదరాబాద్ లో ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాగ్యనగరంలో అతి తక్కువ ధరలో కూడా భోజనం దొరకుతుంది. అలాగే కొన్ని చోట్ల వేల రూపాయల్లో పెడితే కానీ భోజనం రాదు. అలాంటి హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్ల ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ లలో ఖరీదైన కేఫ్ లు, తిను బండారాలు ఉన్నాయి.
హైటిక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో సాధారణ భోజనం చేయాలన్నా జేబులు ఖాళీ అయినట్లే. ఇటీవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాల్లో ఒక పిజ్జా లేదా బర్గర్ ధర రూ.500 కంటే ఎక్కువగా ఉంది. దీని కారణంగా బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,20,000 జీతం.. రేపే లాస్ట్ డేట్
ఇటీవల విరాట్ కోహ్లీకి చెందిన కేఫ్ వన్8 కమ్యూన్‌లో రూ.525 కు స్వీట్ కార్న్ అమ్మడం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై ఆన్ లైన్ లో తెగ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు భాగ్యనగరంలో పేరొందిన నీలోఫర్ హైటెక్ సిటీలో గ్రాండ్ ఓపెనింగ్ కు ముందే వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ లో నీలోఫర్ చాయ్ అంటే తెలియని వారు ఉండరు. చాలా మంది నీలోఫర్ చాయ్ ఇష్టంగా తాగుతారు.
ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, వెన్నతో కూడిన మస్కా బన్ లకు నీలోఫర కేఫ్ ఫేమస్. కొన్నేళ్లుగా హైదరాబాదీలకు ఇష్టమైన ఛాయ్ ప్రసిద్ధి చెందింది. లక్డీ కపూల్, రెడ్ హిల్స్, బంజారా హిల్స్, హిమాయత్ నగర్ లలో ఉన్నఅవుట్ లెట్ లతో పాటు ఇప్పుడు కొత్తగా నీలోఫర్ బ్రాండ్ హైదరాబాద్ ఐటీ హబ్ కు చేరుకుంటోంది.
నాలెడ్జ్ సిటీ రోడ్డులోని మై హోమ్ భుజా పక్కన టీ- హబ్ ముందు కొత్త నీలోఫర్ కేఫ్ అవుట్ లెట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందు లోకేషన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అక్కడ నీలోఫర్ కేఫ్ బిల్డింగ్ ను చూశాక నెటిజన్లు ధరలపై ఆన్ లైన లో పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ముందుగానే అక్కడి ధరలపై జోకులు పేల్చుతున్నారు
సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి.. ‘‘ఇక్కడ చాయ్ ధర మీ ఆస్తిలో 2 శాతం ఉంటుంది. అలాగే దానిపై 18 శాతం జీఎస్‌టీ ఉంటుంది’’ అని జోక్ పేల్చారు. మరొక వ్యక్తి “రూ. 500 చాయ్ లోడింగ్…” కామెంట్ చేశారు. ఇక్కడ చాయ్ తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే అని మరొకర కామెంట్ చేశారు.
మరో వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఇలా కామెంట్ చేశాడు. నీలోఫర్ కేఫ్ లో ఉండే ధరలను నాన్ వెజ్ తో పోల్చి జోక్ పేల్చాడు.
“సింగిల్ చాయ్ – 2 కిలోల మటన్
ఫుల్ చాయ్ – 1 కేజీ మటన్, 1 కేజీ చికెన్, 1 కేజీ చేప, కాలేయం, బోటి
మలై బన్‌తో చాయ్ – మేక.. కేఫ్‌లో కూర్చొని ఛాయ్ తాగితే – మీ మొత్తం అలవెన్సులు” ఖర్చు అవుతోందని కామెంట్ చేశాడు.
హైటెక్ సిటీలో నీలోఫర్ కేఫ్ అవుట్ లెట్ ఇంకో మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉద్యోగం చేసే వారికి నీలోఫర్ కేఫ్ మంచి స్పాట్ గా మారనుంది. నీలోఫర్ చాయ్ తాగడానికి చుట్టుపక్కల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు క్యూకట్టే అవకాశం ఉంది. అయితే ధరలు ఏ రేంజ్ ఉంటాయో.. సామాన్యులకు అందుబాటులో ఉంటాయో.. ఉండవో అని హైదరాబాదీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.