Big Bash league: క్రికెట్ లో అనేక రకాల వింతలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా బౌలర్లు అలాగే బ్యాటర్ల మధ్య వివాదాలు, లేదా సరదా సంఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా… బిగ్ బాష్ లీగ్ 2024-25 లో ( Big Bash League 2024-25 ) అరుదైన సంఘటన జరిగింది. ఒక కొడుకు బౌలింగ్ లో సిక్స్ కొడితే… క్రౌడ్ లో ఉన్న తండ్రి క్యాచ్ పట్టాడు. ఈ అరుదైన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: Pakistan Squad for WI: వెస్టిండీస్‌తో సిరీస్…షాహీన్ అఫ్రిదికి షాక్..7 మార్పులతో పాక్ టీం రెడీ ?
BBL 2024-25లో అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన సంఘటన జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ ( Adelaide Strikers vs Brisbane Heat ) సందర్భంగా పేసర్ లియామ్ హాస్కెట్ ( Liam Haskett )బౌలింగ్ లో భారీ సిక్సు బాదాడు నాథన్ మెక్‌స్వీనీ ( Nathan McSweeney ). లెగ్-సైడ్‌లో వచ్చిన బంతిని నేరుగా క్రౌడ్ లో కొట్టి పడేశాడు. అయితే.. సిక్సు గేట్ దాడిన ఆ బంతి.. సరిగ్గా… లియామ్ హాస్కెట్ ( Liam Haskett ) తండ్రి చేతిలో పడింది. ఆ క్యాచ్ ను మిస్ చేయకుండా… లియామ్ హాస్కెట్ ( Liam Haskett ) తండ్రి పట్టేసుకున్నాడు.
Also Read: Sania Mirza: టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. షమీని కాదని మరీ ?
BBL 2024-25లో అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ చూసేందుకు లియామ్ హాస్కెట్ ( Liam Haskett ) తల్లిదండ్రులు ఇద్దరూ స్టేడియానికి వచ్చారు. సాధారణ ప్రేక్షకుల లాగానే.. మ్యాచ్ తిలకించారు. ఇక ఇదే నేపథ్యంలోనే.. నాథన్ మెక్‌స్వీనీ కొట్టిన సిక్సును క్యాచ్ అందుకున్నాడు హాస్కెట్ తండ్రి. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే… లియామ్ హాస్కెట్ ( Liam Haskett ) తండ్రి క్యాచ్ పట్టగానే… గ్రౌండ్ లో ఉన్న కెమెరాలన్నీ… అతని వైపే తిరిగాయి. దాంతో… లియామ్ హాస్కెట్ ( Liam Haskett ) పేరేంట్స్ ఇద్దరూ ఫుల్ జోష్ లో కనిపించారు.
ఇక ఇది ఇలా ఉండగా.. మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి. అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ ( Adelaide Strikers vs Brisbane Heat ) మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ పై చేయి సాధించింది. చివరికు 56 పరుగుల తేడాతో అత్యధిక స్కోరింగ్ గేమ్‌ను గెలుచుకుంది అడిలైడ్ స్ట్రైకర్స్. హాస్కెట్ క్రెడిట్ వల్లే ఈ మ్యాచ్ గెలిచింది అడిలైడ్ స్ట్రైకర్స్. అతను తన నాలుగు ఓవర్ల స్పెల్ ముగిసే సమయానికి రెండు వికెట్లు తీయగలిగాడు. అంతేకాకుండా డీప్ మిడ్‌వికెట్ ఫెన్స్ వద్ద ఓ క్యాచ్ ను కూడా పట్టాడు.
🚨 A RARE INCIDENT IN CRICKET 🚨
– Son got hit for a six and Father caught that from the stands in Big Bash 😄🔥 pic.twitter.com/1Owq86qfLV
— Johns. (@CricCrazyJohns) January 11, 2025