Pakistan Squad for WI: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( PCB ) కీలక ప్రకటన చేసింది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ ల కోసం 15 మంది సభ్యుల పాకిస్థాన్ జట్టును ( Pakistan Squad ) ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB). జనవరి 11 అంటే శనివారం రోజున వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… పాకిస్థాన్ జట్టులో ఏడు మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ చివరిగా ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొన్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు.
Also Read: Sania Mirza: టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. షమీని కాదని మరీ ?
పాకిస్థాన్ కెప్టెన్ గా షాన్ మసూద్ ( Shaun Masood ) కొనసాగనున్నాడు. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్ గా ఉంటున్నాడు. ఇందరు వికెట్ కీపర్లతో రంగంలోకి దిగుతోంది పాకిస్థాన్. మహ్మద్ రిజ్వాన్, రోహైల్ నజీర్ ఇద్దరు వికెట్ కీపర్లుగా కొనసాగుతారు. ఇటీవలే గాయపడిన సైమ్ అయూబ్ అలాగే, ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్‌ల స్థానంలో మహ్మద్ హురైరాను కూడా జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు. స్పిన్ విభాగంలో, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ , మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు.
ఎడమచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ కూడా వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టులోకి తీసుకుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( PCB ). అమీర్ జమాల్, మహ్మద్ అబ్బాస్, మీర్ హమ్జా, నసీమ్ షా లాంటి ప్లేయర్లకు విశ్రాంతిని ఇచ్చింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( PCB ). ఖుర్రం షాజాద్‌ను కూడా సైడ్ కు ఉంచారు సెలెక్టర్లు. మహ్మద్ అలీని రీకాల్ చేశారు. అన్‌క్యాప్డ్ బ్యాటర్ కాషీఫ్ అలీ జాతీయ జట్టులోకి వస్తున్నాడు.
Also Read: Mahvash – Chahal: చాహల్ తో రిలేషన్.. సంచలన పోస్ట్ పెట్టిన RJ మహ్వాష్ !
వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు కూడా షాహీన్ అఫ్రిది దూరం కానున్నాడు. చాలా మంది ఆటగాళ్ళు జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మధ్యలో విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మాత్రం టెస్ట్ జట్టులోకి రాలేకపోయాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 17 నుంచి ముల్తాన్‌లో జరగనుంది. అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
వెస్టిండీస్ వర్సెస్ టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాషిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్/బ్యాటర్), నోమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్/బ్యాటర్), సాజిద్ ఖాన్ మరియు సల్మాన్ అలీ అఘా.
Pakistan cricket has announced a 15-player squad for the two Test matches against the West Indies, scheduled to take place in Multan from January 17-21 and January 25-29. pic.twitter.com/Qjxhq769m8
— CricTracker (@Cricketracker) January 11, 2025