BigTV English

IPL 2025: ముంబైకి బిగ్‌ షాక్‌…ఇద్దరు ప్లేయర్లు ఔట్‌ ?

IPL 2025: ముంబైకి బిగ్‌ షాక్‌…ఇద్దరు ప్లేయర్లు ఔట్‌ ?

IPL 2025: క్రికెట్‌ అభిమానులకు బిగ్‌ అలర్ట్‌. ఇక ఈ నెల నుంచి క్రికెట్‌ పండుగ ప్రారంభం కానుంది. మొదట ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత ఐపీఎల్‌ 2025 టోర్నమెంట్‌ ( IPL 2025 ) జరుగనుంది. దీంతో క్రికెట్‌ అభిమానులకు పండగ వాతావరణం ఉండనుంది. ఇక ఎల్లుడి నుంచే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో శతకం కొట్టిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నారు. భారీ సెంచరీతో రోహిత్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తే టీమిండియాకు తిరుగు ఉండదు.


Also Read: SRH Fans – IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. షాక్ లో SRH ఫ్యాన్స్… కారణం ఇదే !

అయితే టీమిండియాకు బుమ్రా రూపంలో భారీ షాక్ తగిలింది. టీమిండియాకు వెన్నుముకగా రాణిస్తున్న ఇతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. నడుము కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఈ ఐసీసీ టోర్నమెంట్ నుంచి వైదొలగవలసి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఓకే అయినప్పటికీ ఐపీఎల్ సమయంలో బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపిఎల్ 18వ సీజన్ ప్రారంభమవుతుంది.


మరి చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా ఐపీఎల్ కి కూడా దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగినట్లయితే ముంబై ఇండియన్స్ జట్టుకు కోలుకోలేని గట్టి దెబ్బ తగిలినట్లే అవుతుంది. నిజానికి బుమ్రా గాయం విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించాలని అనుకోలేదు. ఈ పరిస్థితిలో బుమ్రా పూర్తిగా ఫిట్ గా మారడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. బుమ్రా ( bumrah ) గాయం తీవ్రంగా ఉందని అతను కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: IPL – Wrestlers: ఏంట్రా ఈ అరాచకం… IPL 2025లోకి రెజర్లు.. SRH కెప్టెన్‌ గా బీస్ట్‌ ?

అయితే బుమ్రాకు గాయం గురించి బోర్డు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ముంబై శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ నుండి బుమ్రాను తొలగించడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అక్కడ బుమ్రా ఎక్కువ ఓవర్లు వేయడంతో తనపై భారం పడింది. దాంతో సమస్య పెరిగింది. సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ సమయంలో అతనికి తీవ్రంగా వెన్నునొప్పి రావడంతో మ్యాచ్ మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయారు. అలాగే.. గతేడాది ఐపీఎల్‌ లో ముంబై కెప్టెన్‌ పాండ్యాపై ఫైన్‌ పడింది. దీంతో.. ఒక మ్యాచ్‌ కు దూరం కావాల్సి. అంటే… ఐపీఎల్‌ 2025 సీజన్‌ లో మొదటి మ్యాచ్‌ కు పాండ్యా దూరం కానున్నాడు. కాగా… ఐపీఎల్‌ 2025 టోర్నమెంట్‌ మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు జరుగనుంది.

Related News

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

Big Stories

×