BigTV English

SRH Fans – IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. షాక్ లో SRH ఫ్యాన్స్… కారణం ఇదే !

SRH Fans – IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. షాక్ లో SRH ఫ్యాన్స్… కారణం ఇదే !

SRH Fans – IPL 2025: క్రీడాభిమానులను టి-20 కిక్కులో ముంచేసేందుకు, ఈ వేసవిలో క్రికెట్ అభిమానులను ఆదరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సిద్దమయింది. ఐపీఎల్ 18వ సీజన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి {బీసీసీఐ} ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22 నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్.. మే 25 వరకు జరుగుతుంది.


Also Read: IPL – Wrestlers: ఏంట్రా ఈ అరాచకం… IPL 2025లోకి రెజర్లు.. SRH కెప్టెన్‌ గా బీస్ట్‌ ?

ఈసారి 13 స్టేడియాలలో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్ కి కూడా ఈడెన్ గార్డెన్స్ వేదిక కాబోతోంది. ఇక గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఉప్పల్ స్టేడియంలో పరుగుల వేటకు సిద్ధమైంది. హైదరాబాద్ జట్టు మార్చి 23న ఉప్పల్ లో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది.


ఈ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఢీ కొడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతాయి. మే 20న క్వాలిఫైయర్ 1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగుతాయి. అయితే ఈ ఐపీఎల్ 2025 షెడ్యూల్ పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు నిరాశగా ఉన్నారు.

ఎందుకంటే లీగ్ మ్యాచ్ దశలో హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో మ్యాచ్ లేకపోవడం క్రీడాభిమానులకు, మరీ ముఖ్యంగా ఎస్.ఆర్.హెచ్ అభిమానులకు నిరాశ కలిగించింది. ఐపీఎల్ సీజన్ 18 షెడ్యూల్ ప్రకారం.. లీగ్ దశలో ఆర్సిబి తో కానీ, చెన్నై సూపర్ కింగ్స్ తో కానీ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ కారణంగా ఉప్పల్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే క్రీడాభిమానులకు విరాట్ కోహ్లీని, మహేంద్ర సింగ్ ధోనీని చూసే అవకాశం లేదు. కానీ బెంగళూరు, చెన్నై జట్లు ఉప్పల్ లో ఆడే అవకాశాలు లేకపోలేదు.

Also Read: Indian Cricketers – AI: టీమిండియా క్రికెటర్లు… LKG పిల్లలు అయిపోయారు ఏంటి?

క్వాలిఫైయర్ 1 మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్లు ఉప్పల్ వేదికగా జరగనున్న నేపథ్యంలో.. చెన్నై, ఆర్సిబి, ఎస్.ఆర్.హెచ్.. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ తో ఈ రెండు జట్లు తెలపడే అవకాశం ఉంది. ఇక లీగ్ లో ఉన్న పది జట్లను ఈసారి కూడా రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్. గ్రూప్ 2 లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ఈ పది జట్లు.. ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచులు ఆడుతాయి.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×