IPL – Wrestlers: భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ షెడ్యూల్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుండి మే 25 వరకు సాగనుంది. మొత్తం 74 మ్యాచ్ లు 65 రోజులపాటు జరగనున్నాయి. ఇందులో 12 డబుల్ – హేడర్ మ్యాచ్ లు జరుగుతాయి.
Also Read: Indian Cricketers – AI: టీమిండియా క్రికెటర్లు… LKG పిల్లలు అయిపోయారు ఏంటి?
మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగబోతోంది. ఇక మార్చి 23న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. అలాగే ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ లో టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ కీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సీజన్ లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచులు ఆడతాయి.
హోమ్ గ్రౌండ్ లో, ప్రత్యర్థి వేదికపై ఏడు మ్యాచ్ లలో బరిలోకి దిగుతాయి. మరో నెల రోజులలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు {IPL – Wrestlers} సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ అందరికీ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ {డబ్ల్యూడబ్ల్యూఈ} గురించి తెలిసే ఉంటుంది. ఈ టెలివిజన్ రియాలిటీ షో కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇందులో పాల్గొనే రెజ్లర్లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభిస్తుంటుంది. అయితే తాజాగా {IPL – Wrestlers} డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఫ్రాంచైజీల జెర్సీలు {IPL – Wrestlers} దరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు హండెడ్ టేకర్, ట్రిపుల్ హెచ్, జాన్ సీనా, రేండీ ఆర్టన్, ష్వాన్ మైఖేల్, కేన్.. ఇలా పలువురు రెజ్లర్లు ఐపీఎల్ జెర్సీలను ధరించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ { ఏఐ} ద్వారా క్రియేట్ చేసిన {IPL – Wrestlers} ఈ ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో.. ఒకవేళ డబ్ల్యుడబ్ల్యుఈ రెజ్లర్లు క్రికెట్ లోకి దిగితే అచ్చం ఇలానే ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
Also Read: Telugu Warriors vs Bengal Tigers: తెలుగు వారియర్స్ కు అగ్ని పరీక్ష..గెలవకపోతే ఇంటికే ?
ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెడ్డా లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇక పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కి శ్రేయస్ అయ్యర్ ని, వెంకటేష్ అయ్యర్ ని 23.75 కోట్లకు కలకత్తా నైట్ రైడర్స్ దక్కించుకున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">