Mohammad Yousuf: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్ షురూ అవుతుందని ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI). అయితే ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ పై విషం కక్కుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఒకరేమో ఐపీఎల్ తోపు టోర్నమెంట్ అంటుంటే.. మరి కొంతమంది ఐపీఎల్ ( IPL ) చెత్త లీగ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎప్పుడు రియాక్ట్ కానీ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf) కూడా ఈ అంశంపై స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్లను ( Pakistan Players) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు మహమ్మద్ యూసఫ్. ఈ టోర్నమెంటులో పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోకపోతే ఐపీఎల్ పై బ్యాన్ విధించాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడాలని , భారతీయ అభిమానులు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. షాహీన్ అఫ్రిది, ఫర్హాన్ ( Sahibzada Farhan ) లాంటి క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడితే, చూసేందుకు భారత అభిమానులు ఆసక్తిగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు మహమ్మద్ యూసఫ్. ముఖ్యంగా షాహీన్ అఫ్రిదికి ఇండియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందని వ్యాఖ్యానించారు.
బుమ్రా కంటే అద్భుతంగా బౌలింగ్ చేయగల సత్తా షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi )లో ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లను కచ్చితంగా ఐపీఎల్ టోర్నమెంట్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ఐపీఎల్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. లేకపోతే ఐపీఎల్ లో మేమే బోంద పెడతామని వార్నింగ్ ఇచ్చారు మహమ్మద్ యూసఫ్. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను తామేమి కోరుకోవడం లేదని కౌంటర్ ఇస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఫాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్లను కోరుకుంటున్నట్లు కలుస్తోంది.
Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బతుకురా, సంజుపై గిల్ కుట్రలు..ఫోటో మార్ఫింగ్ చేసి మరీ!
🚨 BIG STATEMENT BY MOHAMMAD YOUSUF ON BCCI VS ICC 🚨
"ICC should take Action against BCCI. Indian fans deserve to watch Shaheen Afridi, Sahibzada Farhan in IPL. Shaheen have a huge fan base in india. Shaheen is better than Bumrah" 😆
What's your take 😅pic.twitter.com/Eu8R0Vr2Dr
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 15, 2026