BigTV English

Indian Premier League 2024: ధనాధన్ ఐపీఎల్ పండుగొచ్చింది.. నేడే ఘనంగా ప్రారంభం!

Indian Premier League 2024: ధనాధన్ ఐపీఎల్ పండుగొచ్చింది.. నేడే ఘనంగా ప్రారంభం!

IPL 2024


IPL 2024 to Start from March 22 All Matches To Be Played In India: ఐపీఎల్ సీజన్ 17 పొట్టి క్రికెట్ సంభరం ఈరోజే ప్రారంభం కానుంది. చెన్నయ్ చెపాక్ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాయంత్రం ప్రారంభం కానుంది. నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలోని చెన్నయ్ సూపర్ కింగ్స్, ఇంకా విరాట్ కొహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఓపెనింగ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ హాజరుకానున్నారు.


ప్రారంభ వేడుకలు ముగిసిన తర్వాత.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నుంచి మధ్యాహ్నం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Also Read: ఐపీఎల్‌లో పవర్ ప్లే సిక్సర్ల కింగ్స్ వీరే..

ప్రారంభోత్సవ వేడుకలు సుమారు గంట సేపు జరగనున్నాయి. ఐపీఎల్ ప్రారంభ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్  ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జియో సినిమా యాప్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నాయి.

దేశం నలుమూలల నుంచి చాలా మంది అభిమానులు మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. అందరూ టిక్కెట్ల వేటలో పడ్డారు. ముఖ్యంగా ప్రారంభ వేడుకలను చూసేందుకు క్యూ కట్టారు. ఇంత ఊపు వచ్చేసరికి వెటరన్ క్రికెటర్ అశ్విన్ కూడా టిక్కెట్ల కోసం స్నేహితులను అడగడంతో నెట్టింట వైరల్ గా మారింది. తన పిల్లలు మ్యాచ్ చూడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.

ఐపీఎల్ 2024లో మరో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. థర్డ్ అంపైర్ నిర్ణయాల్లో కచ్చితత్వం, వేగాన్ని పెంచేందుకు బీసీసీఐ “స్మార్ట్ రిప్లే సిస్టమ్”ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఈ సీజన్‌ నుంచే తొలిసారిగా ఐపీఎల్‌లో అమలు కానుంది.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×