Big Stories

Most Sixes In IPL Powerplays: ఐపీఎల్‌లో పవర్ ప్లే సిక్సర్ల కింగ్స్ వీరే..

Most Sixes In IPL PowerplaysPlayers With Most Powerplay Sixes In IPL History (live sports news): ఐపీఎల్ సీజన్ 17 మరొక్కరోజులో ప్రారంభం కానుంది. ఐపీఎల్ అంటేనే సిక్సర్ల పండుగలా ఉంటుంది. బౌండరీలు బాదుడు ఉండనే ఉంటుంది. అందుకే టీ 20కి అంత క్రేజ్ వచ్చింది. ఆట జరుగుతున్నంత సేపు ఎవరెన్ని సిక్సర్లు కొట్టారనే అంశంపైనే వ్యవస్థ నడుస్తుంటుంది. టీ20 క్రికెట్ అంటేనే ధ‌నాధ‌న్ హిట్టింగ్ కు పెట్టింది పేరు.

- Advertisement -

ఐపీఎల్ విషయానికి వస్తే చాలామంది ప్లేయర్లు దుమ్ము దులిపిన వారున్నారు. అయితే ప‌వ‌ర్ ప్లే లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన వారెవరో తెలుసుకుందాం.

- Advertisement -

1. మొదట వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్, యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ, పంజాబ్ తరఫున ఆడాడు. తను అయితే ప‌వ‌ర్ ప్లేలో ఏకంగా 138 సిక్స‌ర్లు కొట్టాడు. ఓవరాల్ గా అయితే 357 కొట్టాడు.

2. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇంకా ప‌లు టీమ్ ల‌కు ఆడాడు. హైద‌రాబాద్ కు టైటిల్ అందించిన టీమ్ లో వార్నర్ భాయ్ ది ప్రధాన పాత్ర. అంతేకాదు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-5 ప్లేయ‌ర్ల‌లో ఒక‌డు. ఇకపోతే ప‌వ‌ర్ ప్లే లో 96 సిక్స‌ర్లు కొట్టాడు. ఓవరాల్ గా చూస్తే 226 కొట్టాడు.

3.టీమ్ ఇండియా కెప్టెన్ సిక్సర్ల శర్మ, అదేనండి మన రోహిత్ శర్మ అయితే ఏకంగా పవర్ ప్లేలో 77 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్ గా అయితే 251 కొట్టాడు. అంతేకాదు కెప్టెన్ గా ముంబై టీమ్ కు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు.

4. టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అయితే హైద‌రాబాద్, పంజాబ్, ఢిల్లీ తదితర జ‌ట్ల త‌ర‌ఫున ఆడాడు. ప్ర‌స్తుతం పంజాబ్ కు ఆడుతున్నాడు. తను అయితే ప‌వ‌ర్ ప్లే లో 72 సిక్స‌ర్లు కొట్టాడు. ఓవరాల్ గా చూస్తే 148 కొట్టాడు.

5. కీవీస్ స్టార్ ప్లేయ‌ర్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ అయితే పవర్ ప్లేలో 70 సిక్స‌ర్లు కొట్టాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు రెండు సెంచ‌రీల‌తో పాటు 15 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఓవరాల్ గా అయితే 130 సిక్సర్లు కొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ కు ఆడాడు.

Also Read: ధోనీ చెప్పే కొత్త కబురు ఇదేనా..? రుతురాజ్ గురించి ముందే తెలుసా..?

6. క్వింటన్ డి కాక్ అయితే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు మారాడు. తను అయితే ప‌వ‌ర్ ప్లే లో 69 సిక్స‌ర్లు కొట్టాడు. ఓవరాల్ గా 114 కొట్టాడు.

7. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. తను ప‌వ‌ర్ ప్లేలో 64 సిక్స‌ర్లు కొట్టాడు. ఓవరాల్ గా 168 కొట్టాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News