BigTV English

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్.. వెలుగులోకి అసలు నిజాలు? L&T లేఖలో బయటపడింది!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్.. వెలుగులోకి అసలు నిజాలు? L&T లేఖలో బయటపడింది!

Kaleshwaram Project


Kaleshwaram Project Latest News:  ఎల్‌ అండ్ టీ, అఫ్కాన్స్ రాసిన లెటర్స్ ఇప్పుడో సెన్సెషన్.. ఇంతకీ ఆ కంపెనీలు రాసిన లెటర్స్‌లో ఏముంది? కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్తేంటి? అపర భగీరథుడు అని చెప్పుకునే కేసీఆర్‌ స్వయంగా డిజైన్ చేశానని ప్రకటించుకున్న.. కాళేశ్వరం ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయింది.

మేడిగడ్డ పిల్లర్స్‌ కుంగాయి.. అన్నారం బ్యారేజీలో లీకైంది.ఇదంతా పాస్ట్.. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ బ్యారేజ్‌ల భవిష్యత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై తనిఖీలు నిర్వహిస్తోంది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బ్యారేజీలు అసలెందుకు విఫలమయ్యాయన్న దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నాయి..ఇంతలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీరోల్ ప్లే చేసిన L&T, అఫ్కాన్స్‌ సంస్థలు ఓ విషయంపై కుండబద్ధలు కొట్టాయి.. బ్యారేజీల కుంగుబాటుకు, పగుళ్లకు, లీకులకు మాకు అస్సలే సంబంధమే లేదంటున్నాయి.. రిపేర్లు, పునరుద్ధరణలకు మాకు ఎలాంటి లింక్ లేదు. అలా చేయలనుకుంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాలి.. ఇవి ఆ కంపెనీల లెటర్స్‌ చెబుతున్న ఓవరాల్ ఇన్ఫర్మేషన్.


మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది? పగుళ్లకు ఏంటి కారణం? అంటే తమకు ఆ విషయంతో సంబంధం లేదు. అది డిజైన్ లోపం వల్ల జరిగిన ప్రమాదం. L&T చెబుతున్న సమాధానం ఇది. మరి పిల్లర్లను రిపేర్ ఎవరు చేస్తారంటే? ఇలా జరిగితే రిపేర్లు చేయాలని మాతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఒకవేళ చేయాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోండి అని కుండబద్ధలు కోట్టేసింది L&T..

Also Read: నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వరుస భేటీలు.. అన్ని విషయాలపై ఆరా

ఇక అన్నారం బ్యారేజీ విషయానికి వద్దాం..ఈ బ్యారేజీని నిర్మించింది అఫ్కాన్స్‌ సంస్థ.. ఈ బ్యారేజీలో లీక్స్‌కు మాకు ఏం సంబంధం లేదని చెబుతోంది అఫ్కాన్స్..డిజైన్ లోపం వల్లే ఈ బ్యారేజీలో లీక్స్‌ జరుగుతున్నాయి.. ఏదైనా డిఫెక్ట్స్‌ ఉంటే రిపేర్లు చేస్తాం.. కానీ ఆ టైమ్ 2021లో ముగిసింది. సో ఇప్పుడు మాకేం సంబంధం లేదు. ఇవన్నీ చెబుతూనే మరో వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం బ్యారేజీ ప్రమాదంలో ఉంది.. బ్యారేజీని రక్షించాలంటే వెంటనే రిపేర్లు చేయాలి.. ఇది అఫ్కాన్స్‌ రాసిన లెటర్‌లోని సారాంశం..

మొత్తంగా ఈ రెండు ఇంజనీరింగ్ సంస్థలు చేబుతున్న విషయం ఏంటంటే. .ఈ రెండు బ్యారేజీలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలంటే..మళ్లీ ఒప్పందాలు చేసుకోవాల్సిందే మళ్లీ వందల కోట్లు కుమ్మరించాల్సిందే.. మరి ఇన్ని విషయాలు చెబుతున్న సంస్థలు..నేషనల్ కమిటీకి ముందుక వచ్చి సమాధానాలు చెప్పారా? అంటే అదీ లేదు.. విచారణకు ఎందుకు రావడం లేదు? ఈ లెటర్స్‌ ఎందుకు రాస్తున్నారు? కమిటీ ముందుకు వస్తే అసలు భండారం బయటపడుతుందని ఏమైనా భయపడుతున్నారా?

కాస్త పాస్ట్‌లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏం మాట్లాడారో..ఓ సారి గుర్తు చేసుకోవాలి మనం.. కుంగిన పిల్లర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే అని బల్లగుద్దీ మరీ చెప్పారు అప్పట్లో బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదన్నారు.. కానీ ఇప్పుడేమైంది రిపేర్లతో తమకేమీ సంబంధం లేదంటున్నాయి ఇంజనీరింగ్ సంస్థలు. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి.. అంటే ఆ భారం కూడా ప్రజలపైనే పడనుంది..

Also Read: నేను సీఎంగా ఉన్నానంటే అది మల్కాజ్‌గిరి పార్లమెంట్ వల్లే..!

ఇది కంపెనీల సంగతి.. మరోవైపు NDSA దర్యాప్తులో.. మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి..అసలు మీరు డిజైన్ చేసింది బ్యారేజీకా.. లేక డ్యామ్‌కా? ఇది కమిటీ అధికారులను అడిగిన ప్రశ్న.. బ్యారేజీలలో అన్నారం 2.2 కిలో మీటర్లు.. సుందిళ్ల 5.6 కిలో మీటర్ల దూరం నిర్మాణ స్థలం ఎందుకు మారింది? ఇలా మార్చడానికి రీజన్సెంటి? ఇలా మార్చాక.. ఆ నేల స్వభావాన్ని టెస్ట్‌ చేశారా? అలా టెస్ట్‌ చేయకపోవడం వల్లే పిల్లర్లు కుంగాయా? అసలు బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగాయి? బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్‌ చేశారు? ఇంజనీర్ల జాబ్‌ చార్ట్‌ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్‌ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది నిపుణుల కమిటీ..

ఈ మొత్తం విచారణలో మరో హైలెట్ టాపిక్‌ తెరపైకి వచ్చింది.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై.. 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి.. అంటే సీఎం కేసీఆర్‌ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు NDSAకి అధికారులు తెలిపారు.. అలా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే డీపీఆర్‌లను రూపొందించినట్టు కూడా తేలింది.. మరి వాటి ఆమోదం వరకైనా ఆగకుండానే.. నిర్మాణ పనులు ప్రారంభించారు..ఇవీ ఇప్పటి వరకు తేలిన అంశాలు.. ఇంకా తేలాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి..

అసలు బ్యారేజ్‌లను రిపేర్ చేసేందుకు సాధ్యమవుతుందా? అయితే ఏ పద్ధతిలో చేయాలి? అవి పూర్తయ్యే సరికి ఎంత సమయం పడుతుంది? మళ్లీ ఇంజనీరింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాల్సిందేనా? ఈ విషయాలన్నీ తేలాలంటే కాళేశ్వరం కథల వెనక అసలు నిజాలను.. NDSA వెలుగులోకి తీసుకొచ్చే వరకు ఆగాల్సిందే..

Tags

Related News

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Big Stories

×