BigTV English

KKR Vs SRH, IPL 2024 Final: ఐపీఎల్ విజేతలుగా.. కోల్ కతా రెండు సార్లు, హైదరాబాద్ ఒకసారి.. మరి ఈసారి?

KKR Vs SRH, IPL 2024 Final: ఐపీఎల్ విజేతలుగా.. కోల్ కతా రెండు సార్లు, హైదరాబాద్ ఒకసారి.. మరి ఈసారి?

Both Kolkata and Hyderabad Teams Have Won IPL Trophies so Far: ఐపీఎల్ 2024 ఫైనల్ వేడుకలకు సమయం దగ్గర పడుతోంది. మరి ఫైనల్ వరకు చేరుకున్న కోల్ కతా, అలాగే హైదరాబాద్ రెండు జట్లు కూడా ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాయా? గెలిస్తే ఎన్నిసార్లు గెలిచాయో ఒకసారి చూద్దామా..


ముందుగా కోల్ కతా విషయానికి వస్తే.. గౌతం గంభీర్ తో, ఆ జట్టుకి ఏదో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు తన చేరిక వల్ల అన్నిరకాలుగా కోల్ కతా లైమ్ లైట్ లోకి వస్తోంది. ముఖ్యంగా 2012, 2014 లో రెండు సార్లు గౌతం గంభీర్ కెప్టెన్సీలో కోల్ కతా ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. తర్వాత శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 2021లో ఫైనల్ వరకు వెళ్లి చెన్నయ్ చేతిలో పరాజయం పాలైంది.

ఈ క్రమంలో గౌతం గంభీర్ జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎంపీ గా గెలిచాడు. ఆ తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థను కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్నాడు. వీటికి బోలెడంత ఫండ్స్ కావాలి. ఈ నేపథ్యంలో ఎంపీగా రెండోసారి పోటీ చేయనని తెలిపి.. మళ్లీ కోల్ కతా జట్టుకి మెంటార్ గా వచ్చేశాడు.


వచ్చిన వెంటనే జట్టులోని చాలామందిని నిర్దాక్షిణ్యంగా తీసి పారేశాడు. కొత్తవారిని చేర్చుకున్నాడు. ఇంత గందరగోళం జరుగుతున్నా.. ఫ్రాంచైజీ ఓనర్ షారూఖ్ ఖాన్ అస్సలు జట్టు కూర్పులో వేలు పెట్టలేదు.  అంతా గౌతం గంభీర్ పైనే బాధ్యతలు పెట్టాడు. ఈ క్రమంలో మళ్లీ శ్రేయాస్ అయ్యర్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వెనుక నుంచి కథంతా గౌతం గంభీర్ నడిపించాడు.

Also Read: ఫైనల్స్ కు ముందు ప్రాక్టీస్ చేయని.. హైదరాబాద్ సన్ రైజర్స్

ఇప్పుడు మళ్లీ సక్సెస్ ఫుల్ గా ఫైనల్ వరకు కోల్ కతా ప్రయాణం సాఫీగా సాగింది. ఒక మూడు ఓటములు ఉన్నా, వాటిని దాటుకుంటూ ముందడుగు వేసింది. దీనివెనుక గౌతం గంభీర్ క్రికెట్ బుర్ర పనిచేసిందని అందరూ అంటున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా హెడ్ కోచ్  రేస్ లో గౌతం గంభీర్ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ప్రయత్నాలు చేస్తోందని వినికిడి.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2016లో మాత్రమే ట్రోఫీ సాధించింది. అది కూడా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో జట్టు కప్ సాధించింది. అయితే  2018లో ఒకసారి ఫైనల్ వరకు వెళ్లి, చెన్నయ్ చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ నేతృత్వంలో ఫైనల్ వరకు చేరింది.

ఒకవేళ కప్ సాధిస్తే…హైదరాబాద్ కి ఆస్ట్రేలియా సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే హైదరాబాద్ ఫ్రాంచైజీ.. తాజాగా ఏం చేసిందంటే జట్టు జెర్సీలను మార్చేసింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ను.. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు సార్లు గెలిచింది. అందువల్ల అక్కడ వాడిన జెర్సీలనే ఇక్కడ కూడా ఉపయోగించారు. ఇవన్నీ చూస్తే పాట్ కమిన్స్ మరికొన్నాళ్లు హైదరాబాద్ కి కెప్టెన్ గా ఉంటాడనడంలో సందేహం లేదని అంటున్నారు.

ఇంతకీ సాయంత్రం జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిచి, ఎవరి రికార్డులను మెరుగుపరుచుకుంటారో చూడాలి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×