BigTV English

Sunrisers Hyderabad Practice: ఫైనల్స్ కు ముందు ప్రాక్టీస్ చేయని హైదరాబాద్ సన్ రైజర్స్!

Sunrisers Hyderabad Practice: ఫైనల్స్ కు ముందు ప్రాక్టీస్ చేయని హైదరాబాద్ సన్ రైజర్స్!

Sunrisers Hyderabad Say no to Practice Before IPL 2024 Final Match: ఐపీఎల్ సీజన్ 2024లో అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చిన హైదరాబాద్ సన్ రైజర్స్ అనూహ్యంగా  ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టింది. అయితే అందరూ ఏమైంది? ఏమైంది? అని కంగారు పడుతుంటే, సాక్షాత్తూ హైదరాబాద్ ఫ్రాంచైజీయే క్యాన్సిల్ చేసిందని తెలిసింది.


నెటిజన్లు ఊరుకుంటారా? కారణాలు అన్వేషించడం మొదలుపెట్టారు. దీంతో వారి దృష్టికి వచ్చినదేమిటంటే ముఖ్యంగా చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో గాలి లేకపోవడం, తీవ్ర ఉక్కపోత కారణంగా ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దానిని దృష్టిలో పెట్టుకుని రద్దు చేశారని తెలిసింది.

ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ఉక్కపోత వల్ల ఆటగాళ్లు చెమటలు కక్కారు. అందరూ త్వరగా అలసిపోయారు. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్ల ఓటమికి సెకండ్ బ్యాటింగ్ కూడా ఒక కారణమని అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్లు గ్రౌండులో తీవ్రంగా శ్రమించి బౌలింగ్ చేసి, ఫీల్డింగ్ కాసి, చెమటలు కక్కుకుంటూ శ్రమించారు. డీ హైడ్రేషన్ కారణంగా నీరసించిపోయారు.


Also Read: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్, రూ. 2.07 కోట్లు

వెంటనే బ్యాటింగ్ కి వచ్చారు. మనవాళ్ల కన్నా విదేశీ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అది రాజస్థాన్ ఓపెనర్ గా వచ్చిన టామ్ కొహ్లెర్ పరిస్థితిని చూస్తే అర్థమైంది. మాట్లాడితే కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటూ ఉండటంతో ఒక దశలో అంపైర్ వచ్చి, మ్యాచ్ ఆలస్యం అవుతుందంటూ హెచ్చరించాడు .ఈ పరిస్థితుల్లో ఒక షాట్ కొట్టి తను అవుట్ అయిపోయాడు. ఒక సింగిల్ రన్ తీసి తీవ్రంగా బ్యాటర్లు అలసిపోయారు. అలాంటిది రెండు, మూడు పరుగులు చేయాలంటే వారి వల్ల కాలేదు.

అదే హైదరాబాద్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ అంతా బ్యాటర్లు క్రీజులో ఉండటం వల్ల, మిగిలిన అందరికీ రెస్ట్ దొరికింది. ఒకరి తర్వాత ఒకరు బ్యాటింగ్ కి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అందువల్ల రాజస్థాన్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వచ్చారు. బహుశా ఇవన్నీ గమనించిన హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తే, తర్వాత డీ హైడ్రేషన్ అయి నీరసించిపోతే, గేమ్ లో సర్వశక్తులు ఒడ్డలేరని భావించి.. వద్దు అన్నట్టు సమాచారం.

Also Read: Kavya Maran Crying After SRH’s Lost in IPL 2024: ఇది కార్పొరేట్ స్ట్రాటజీనా?.. కావ్య పాప అందుకే ఏడ్చిందా..

దీంతో ఆటగాళ్లందరూ హోటళ్ల రూమ్స్ వదిలి బయటకు రాలేదు. చక్కగా ఏసీ రూమ్స్ లో రిలాక్స్ అయ్యారు. మ్యాచ్ కి ముందు వ్యూహాలు, ప్రత్యర్థి ఆటగాళ్ల బలాలు, బలహీనతలు వీటిపై చర్చించినట్టు తెలిసింది. కోల్ కతా టీమ్ పాత వీడియోలు, ఓడిపోయిన మ్యాచ్ లు, గెలిచిన మ్యాచ్ లు చూశారు. ఇంక ప్రధాన బ్యాటర్లు.. ఏ బాల్ కి అవుట్ అవుతున్నారు, వారి వీక్ పాయింట్లు ఏమిటి? ఇవన్నీ డిస్కస్ చేశారని అంటున్నారు. మొత్తానికి నెట్టింట హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ రద్దు కావడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×