BigTV English

Alcaraz beat Li Tu: ఆసక్తికరంగా యూఎస్ ఓపెన్, శుభారంభం చేసిన అల్కరాస్..

Alcaraz beat  Li Tu: ఆసక్తికరంగా యూఎస్ ఓపెన్, శుభారంభం చేసిన అల్కరాస్..

Alcaraz beat Li Tu: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ల హవా కొనసాగుతోంది. తాజాగా ప్రపంచ నెంబర్ టు, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన లి టుపై విజయం సాధించి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు.


యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ల హవా కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో అల్కరాస్, జాస్మిన్ పావోలిలు శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడ్ క్రీడాకారుడు లి టుతో తలపడ్డాడు అల్కరాస్. తొలి సెట్‌ను సునాయాశంగా సొంతం చేసుకున్న అల్కరాస్, సెకండ్ సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు స్పెయిన్ ఆటగాడు. మూడు, నాలుగు సెట్లను వరుసగా గెలుచుకుని తర్వాత రౌండ్లో అడుగుపెట్టాడు.

ప్రపంచ నెంబర్ త్రీ ఆటగాడు, స్పెయిల్ ప్లేయర్ అల్కరాస్.. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు మేజర్ టోర్నీలను గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం దక్కించుకున్నాడు. యూఎస్ ఓపెన్ గెలిచి ఈ ఏడాది సరైన ముగింపు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అల్కరాస్.


ALSO READ: 48 సెంచరీలు, 19 వేల పరుగులు చేసినా.. పక్కన పెట్టారు

అల్కరాస్‌తో తలపడిన ఆస్ట్రేలియాకు చెందిన లై టు దాదాపు ఆరేళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టాడు. చదువు నిమిత్తం 2014లో టెన్నిస్ దూరమయ్యాడు అడిలైడ్ ప్లేయర్. ఆ తర్వాత మళ్లీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని యూఎస్ ఓపెన్‌లో అన్ సీడ్ క్రీడాకారుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

మహిళల సింగిల్స్ విభాగంలో ఇటలీకి చెందిన జాస్మిన్ పాయోలిని కెనడాకు చెందిన ఆండ్రీస్సుపై విజయం సాధించింది. గడిచిన మూడు టోర్నీల్లో ఆండ్రీస్సుపై గెలుపొందింది జాస్మిన్. 2019లో యూఎస్ ఓపెన్ విజేత అయిన ఆండ్రీస్సు.. జాస్మిన్‌తో విరోచితంగా పోరాటం చేసింది.

ఇద్దరి మధ్య తొలి సెట్ టై బ్రేక్‌ దారి తీసింది. ఇందులో 7-5 తేడాతో ఓటమి పాలైంది జాస్మిన్. ప్రత్యర్థి బలబలాలను అంచనా వేసిన జాస్మిన్, సెకండ్, థర్డ్‌లో ఆది నుంచి ఎదురుదాడి మొదలుపెట్టింది. అనుకోని తప్పిదాలు చేసింది ఆండ్రీస్సు. వాటిని తనకు అనుకూలంగా మలచుకుంది జాస్మిన్. చివరకు ఇటలీ బ్యూటీ పైచేయి సాధించింది. దీంతో మూడు సెట్లను 7-5, 6-2, 6-4 తేడాతో విజయం సాధించింది.

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×