BigTV English

EPFO wage ceiling: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం!

EPFO wage ceiling: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం!

EPFO wage ceiling| ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగులకు కూడా త్వరలో కార్మిక మంత్రిత్వ శాఖ ఓ శుభవార్త చెప్పనుంది. ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్ కేటాయింపుల్లో భాగం ప్రైవేట్ ఉద్యోగుల కనిష్ట పీఫ్ వేతన పరిమితిని పెంచాలని కోరుతూ కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రపోజల్ పంపింది.


జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఫైనాన్స్ మినిస్ట్రీ త్వరలోనే కార్మిక మంత్రిత్వశాఖ పంపిన ప్రపోజల్ పై నిర్ణయం తీసుకోనుంది. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రపోజల్ లో ప్రైవేట్ ఉద్యోగులకు ప్రస్తుతమున్న కనిష్ట రూ.15000 వేతన పరిమితిని రూ.21000 కు పెంచాలని సూచన చేసింది.

మీడియా రిపోర్ట్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబూషన్ కోసం వేతన పరిమితిని పెంచమని కార్మిక శాఖ ఏప్రిల్ నెలలోనే ప్రపోజల్ పంపింది. అయితే ఈ ప్రపోజల్ ని ఆర్థిక శాఖ త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.


2014, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఒ) ఆధ్వర్యంలోని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపిఎస్) వేతన పరిమితి రూ.15000 గా ఉంది. అయితే ఈ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగులకు అందే పెన్షన్, ఇతర లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read:  నెలకు రూ.1.28 కోట్లు ఆఫీస్ రెంటు!.. బ్లాక్ రాక్ కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

ముఖ్యంగా ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు పెన్షన్, ఈపిఎఫ్ కాంట్రిబూషన్ విషయంలో కార్మిక శాఖ సూచనలకు ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే.. వేతన పరిమితి రూ.15000 నుంచి రూ.21000 పెరుతుంది. ఫలితంగా ఈపిఎస్ వేతన పరిమితి రూ.21000 పెరిగితే.. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మొత్తం కూడా అధికంగా లభిస్తుంది.

మరోవైపు ఈపిఎస్-95 జాతీయ నిరసన కమిటీ సభ్యులు మంగళవారం ఈపిఎఫ్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతినెలా అందే పెన్షన్ ని కనీసం రూ.7500 చేయాలని చాలా కాలంగా ఈ కమిటీ డిమాండ్ చేస్తోంది. అయితే మంగళవారం జరిగిన సమావేశంలో పెన్షనర్లకు పూర్తి మెడికల్ కవరేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

ప్రస్తుతం పెన్షనర్లకు ప్రతి నెలా సగటున రూ.1450 మాత్రమే పెన్షన్ లభిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.7500 పెంచాలని ఈపిఎస్-95 ఎన్ఎసీ చాలాకాలంగా నిరసనలు చేస్తోంది.

ఆగస్టు నెల మొదటివారంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా తో ఈపిఎస్-95 జాతీయ నిరసన కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవియా వారి డిమాండ్లు నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఈపిఎస్-95 ఎన్ఎసీలో 7.5 కోట్ల మంది ఉద్యోగులు, 78 లక్షల రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు.

Also Read: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ మైలేజ్.. ధర మాత్రం అస్సలు ఊహించలేరు..!

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×