BigTV English

Carlos Alcaraz Wins Wimbledon Again: జకోవిచ్‌ను చిత్తుగా ఓడించి ‘వింబుల్డన్ టైటిల్’ గెలిచిన అల్కరాస్

Carlos Alcaraz Wins Wimbledon Again: జకోవిచ్‌ను చిత్తుగా ఓడించి ‘వింబుల్డన్ టైటిల్’ గెలిచిన అల్కరాస్

Carlos Alcaraz wins Wimbledon Again: డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ ను తన సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో నొవాక్ జకోవిచ్ ను చిత్తుగా ఓడించి రెండో ఏడాదిలోనూ మరింత చెలరేగాడు. తొలి సెట్ నుంచి కూడా దూకుడుగా ఆడుతూ వచ్చాడు అల్కరాజ్. నిర్ణయాత్మక మూడో సెట్ లో మరింతగా చెలరేగాడు. 6-2, 6-2, 7-6 జకోను వణికించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో సింగిల్స్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్నే జకో కల కలగానే మిగిలిపోయింది.


టోర్నీ ఆరంభం నుంచి కూడా అల్కరాజ్ అదరగొడుతూ వచ్చాడు. సెమీఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ ను మట్టి కరిపించిన స్పెయిన్ స్టార్ ఆదివారం స్పెయిన్ కోర్టులో రఫ్పాడించాడు. మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడి తొలి సెట్ ను గెలుపొందాడు. అదే ఊపులో రెండో సెట్ గెలుపొంది జకోను ఒత్తిడిలో పడేశాడు.

Also Read: జింబాబ్వేతో చివరి టీ20లోనూ భారత్ విజయం


అయితే, అనూహ్యంగా పుంజుకున్న సెర్బియా ఆటగాడు గట్టి పోటీని ఇచ్చాడు. దీంతో మూడో సెట్ హోరాహోరీగా సాగింది. కానీ, స్పెయిన్ స్టార్ పట్టువదలని యోధుడిలా పోరాడుతూ జకో ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు చాంపియన్ గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం ప్రేక్షకులకు విజయాభివందనం చేశాడు. విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లి తన టీమ్ తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. వింబుల్డన్ 2023 తుది పూరులోనూ అల్కరాజ్ చేతిలో జకోవిచ్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. 21 ఏండ్ల వయసులోనే రెండో వింబుల్డన్ టైటిల్ ను గెలిచిన అల్కరాజ్.. టెన్నిస్ లో తన శకం ప్రారంభమైందని మరోసారి చాటాడు.

Tags

Related News

Viral Video: 3 కొండల నడుమ క్రికెట్… కొంచెం అటు ఇటు అయినా ప్రాణం పోవాల్సిందే

Asia Cup 2025: ఆసియా కప్ కోసం డేంజర్ బౌలర్లను దించుతున్న టీమిండియా.. ఇక ప్రత్యర్ధులకు పీడ కలలే

Harbajan Singh: ఇండియన్ ఆర్మీని చంపిన పాకిస్తాన్ కొడుకులతో క్రికెట్ ఆడుదామా..? బీసీసీఐకి హర్భజన్ వార్నింగ్

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Big Stories

×