Telugu Warriors Team: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ {సిసిఎల్} 2025 సీజన్ ఫిబ్రవరి 8వ తేదీ నుండి ప్రారంభమైంది. ఈ 11వ సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి 8 రోజున మొదటి రోజే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండవ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ – కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి. అయితే గత నాలుగు సీజన్లలో ఛాంపియన్గా నిలిచిన తెలుగు వారియర్స్.. ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే కర్ణాటక బుల్డోజర్స్ పై ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కన్నడ జట్టు ఓపెనర్లు పరుగుల వరద పారించారు. మొదటి ఇన్నింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది కర్ణాటక బుల్డోజర్స్. బ్యాటర్ కృష్ణ 80 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక తెలుగు బౌలర్లలో ఆది, ఖయ్యూం చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టుకి ఓపెనర్లు శుభారంభం అందించారు.
కానీ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. ఐదు వికెట్ల నష్టానికి కేవలం 99 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ అక్కినేని అఖిల్ ఆఫ్ సెంచరీ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆదర్శ్ 25, అశ్విన్ 12 పరుగులు మినహా.. మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. కర్ణాటక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో తెలుగు వారియర్స్ ని కట్టడి చేశారు. దీంతో కర్ణాటక జట్టు 14 పరుగులు ఆదిక్యాన్ని సాధించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లోను 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది కర్ణాటక.
ఇక 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తెలుగు వారియర్స్ పై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది కన్నడ జట్టు. ఈ నేపథ్యంలో రెండవ మ్యాచ్ లోనైనా గెలుపొంది పరువు నిలబెట్టుకోవాలనే నేపథ్యంలో తెలుగు వారియర్స్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6:30 గంటలకు తెలుగు వారియర్స్ – చెన్నై రినోస్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పల్ లో అడుగుపెట్టిన హీరోలు… ఆ బస్సు మాత్రం అదుర్స్ !
ఈ క్రమంలో గురువారం సాయంత్రమే తెలుగు వారియర్స్ జట్టు ఉప్పల్ మైదానానికి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే తెలుగు వారియర్స్ ప్రాక్టీస్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని “కుర్చీ మడతపెట్టి” సాంగ్ ని ఆడ్ చేసి వైరల్ చేస్తున్నారు తెలుగు వారియర్స్ అభిమానులు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">