BigTV English

Venky Monkey: అక్క కోసం వెళ్లి చెల్లిని పడేశాడు… వెంకీ మంకీ క్రేజీ లవ్ స్టోరీ గురించి తెలుసా?

Venky Monkey: అక్క కోసం వెళ్లి చెల్లిని పడేశాడు… వెంకీ మంకీ క్రేజీ లవ్ స్టోరీ గురించి తెలుసా?

Venky Monkey : ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో ‘జబర్దస్త్’ (Jabardasth) ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు పాపులర్ అయ్యారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు ప్రత్యేకంగా గుర్తింపుని సైతం దక్కించుకున్నారు. అంతేకాకుండా చాలామంది సినిమాలలోనూ అవకాశాలు కొట్టేశారు. ‘జబర్దస్త్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్లలో వెంకీ మంకీ కూడా ఒకరు. వాలెంటెన్స్ డే సందర్భంగా వెంకీ మంకీ (Venky Monkey) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి వెల్లడించారు.


అక్క కోసం వెళ్లి చెల్లిని పడేసిన వెంకీ మంకీ

వెంకీ మంకీ అనగానే మనకు గుర్తొచ్చేది ‘జబర్దస్త్’. ఆయన మిమిక్రీ కూడా చేస్తాడు అన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వెంకీ తన భార్యతో కలిసి వాలెంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా తన భార్యతో పాటు పిల్లల్ని కూడా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే తన భార్యతో పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది? అనే విషయాన్ని వెల్లడించారు.


వెంకీ మాట్లాడుతూ తన భార్య సిస్టర్ మంచి ఫ్రెండ్ అని, అలా వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడే… ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి, ఆమె సిస్టర్ ని పడేసానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఆమెను పది అంతస్తుల భవనంపైకి తీసుకెళ్లి ప్రపోజ్ చేశానని వెంకీ వెల్లడించారు. పెద్దగా హంగామా ఏమీ లేకుండా “నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను” అని చెప్పగానే, అప్పటికే మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో ఆమె కూడా ఓకే చెప్పిందట. ఇక ఆ తర్వాత తన భార్య తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, ఒకేరోజులో హడావిడిగా పెళ్లి జరిగిపోయింది అని చెప్పుకొచ్చారు వెంకీ. భార్య తరఫున పెళ్లికి ఎవరూ రాలేదు, కానీ తన తరఫున మాత్రం అందరికీ వెహికల్స్ పంపించి మరీ తీసుకొచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నామని వెంకీ తెలిపారు.

జబర్దస్త్ లో ఇంత గ్యాప్ ఎందుకు?

అయితే నిజానికి వెంకీ గవర్నమెంట్ ఉద్యోగి. కానీ తనకంటూ ఒక గుర్తింపు రావాలన్న తపనతో ఆయన అలాంటి మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకొని, ‘జబర్దస్త్’లోకి వచ్చానని గతంలో వెల్లడించారు. చమ్మక్ చంద్ర ఫోన్ కాల్ తో ‘జబర్దస్త్’లోకి అడుగు పెట్టిన వెంకీ ఆ తర్వాత టీం లీడర్ గా కూడా కొనసాగారు. కానీ ఇటీవల కాలంలో ఆయన షోలో కనిపించట్లేదు. తాజా ఇంటర్వ్యూలో మరి ఈ లాంగ్ గ్యాప్ కి కారణం ఏంటి? అని ప్రశ్నించగా… “కన్ఫ్యూజన్లో ఎక్కువ కామెడీ చేస్తానని అందరూ చెబుతుంటారు. దానివల్లే మంచి పేరు కూడా వచ్చింది. అయితే ‘జబర్దస్త్’లో అక్కడి వరకే ఆగిపోతాను, అంతకంటే గుర్తింపు ఏమీ ఉండదు. అందుకే దాని నుంచి బయటకు వచ్చాను. మళ్లీ పిలుపు వచ్చినప్పటికీ ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నానని వాళ్ళకి చెప్పాను” అంటూ చెప్పుకోచ్చారు వెంకీ మంకీ.

 

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×