Telugu Warriors – CCL 2025: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 సీజన్ ఫిబ్రవరి 8వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. పది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ఇప్పుడు 11వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 8న ప్రారంభం రోజు చిన్నస్వామి స్టేడియంలో రెండు మ్యాచ్ లను నిర్వహించారు. ఇందులో మొదటి మ్యాచ్ లో చెన్నై రైనోస్ – బెంగాల్ టైగర్స్ పోటీపడ్డాయి. ఆ తరువాత వెంటనే రెండవ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ – కర్ణాటక బుల్డోజర్ జట్లు పోటీ పడ్డాయి.
Also Read: IPL 2025: దెబ్బకొట్టిన అంబానీ.. ఐపీఎల్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్రీగా చూడలేం.. కొత్త ఛార్జీలు ఇవే ?
ఈ ఆరంభ మ్యాచ్ లలోనే కన్నడ, బెంగాల్ జట్లు తమ సత్తాను చాటుకున్నాయి. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించి.. ఈ జట్లు ప్రత్యర్థి జట్లపై తమ ఆదిక్యాన్ని కొనసాగించాయి. నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన తెలుగు వారియర్స్.. తన తొలి మ్యాచ్ లోనే కర్ణాటక బుల్డోజర్ పై ఓడిపోయింది. అయితే రెండవ మ్యాచ్ లోనైనా గెలిచి తెలుగు వారియర్స్ పరువు నిలబెట్టుకుంటుందా..? అని సినీ, క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు చెన్నై రినోస్ – కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరుగుతోంది. ఇక సాయంత్రం 6:30 గంటలకు తెలుగు వారియర్స్ – బోజ్ పురి దబాంగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ల కోసం ఉప్పల్ స్టేడియంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
సెలబ్రిటీల టి-20 మ్యాచ్ లకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ కోసం నిన్న సాయంత్రం తెలుగు వారియర్స్ జట్టు ఉప్పల్ మైదానానికి చేరుకుంది. తెలుగు వారియర్స్ జట్టు బస్ లోంచి దిగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత.. ఈరోజు జరగబోయే రెండో మ్యాచ్ పై తెలుగు వారియర్స్ పూర్తిగా దృష్టి పెట్టింది.
Also Read: No Indian Flag at Stadium: టీమిండియాకు ఘోర అవమానం.. అరె ఎంతకు తెగించార్రా..?
మరోవైపు సొంత గడ్డ హైదరాబాదులో జరిగే మ్యాచ్ కావడంతో ఇందులో సత్తా చాటే ఎందుకు రెడీ అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలుపొంది పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది తెలుగు వారియర్స్. అయితే మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా కెప్టెన్ అఖిల్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపించాయి. కానీ మరికొందరు మాత్రం టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విఫలం కావడంమే తొలి మ్యాచ్ లో ఓటమికి కారణం అని అంటున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">