Dhanashree Verma : టీమిండియా (Team India) క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ముంబై లోని బాంద్రా ఫ్యామిలి కోర్టు విడాకులు వీరికి మంజూరు చేసింది. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్, ధన శ్రీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలుల తప్పనిసరిగ్గా విరామ గడువును బాంబే హైకోర్టు రద్దు చేసింది. మార్చి 20 లోపు విడాకుల పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన కోర్టు మార్చి 20, 2025న విడాకులను మంజూరు చేసింది. ధన శ్రీ (Dhanashree Verma) కి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించాడట చాహల్. వీరి పెళ్లి 2020 లో జరిగింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ జంట.. గతంలో పెట్టినటువంటి పోస్టులు అభిమానులను గందరగోళానికి గురి చేసాయి.
Also Read : rohit – travis head : ట్రావిస్ హెడ్ తో రోహిత్ బ్రేకప్… బెయిర్స్టోతో లైన్ క్లియర్
ఇదిలా ఉంటే.. తాజాగా చాహల్ కి షాక్ అనే చెప్పాలి. ధన శ్రీ మరో ప్రియుడితో ముంబైలోని ఎయిర్ పోర్టు లో కనిపించింది. అందులో అతనికి హగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఇటీవలే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రోడక్సన్ లో ఈమె ఓ సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. సినిమా కోసం హైదరాబాద్ కి ఇటీవలే వచ్చేసిందట ధన శ్రీ వర్మ. తెలుగు డ్యాన్స్ మాస్టర్ యష్ తో కూడా స్టెప్టులు వేసి ఈ బ్యూటీ. ఇద్దరూ చాలా రొమాంటిక్ గా డ్యాన్స్ చేసి మరి.. రచ్చ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను అలాగే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ధన శ్రీ వర్మ. తన కొత్త టీమ్ అంటూ పరిచయం కూడా చేసింది. ఈ వీడియోలు.. ఫొటోలు వైరల్ కావడంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ డాన్స్ ఇలాగే వ్యహరించి.. కాపురం కూల్చుతుందని.. కామెంట్స్ చేస్తున్నారు. అందుకే క్రికెటర్ చాహల్ కూడా వదిలేశాడని.. చురకలు అంటిస్తున్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్, మాజీ సతీమణి ధన శ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం విధితమే.
చాహల్-ధన శ్రీ గత కొద్ది రోజుల పాటు ప్రేమించుకొని.. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ధనశ్రీకి ప్రస్తుతం 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 1996 సెప్టెంబర్ 27న దుబాయ్‌లో జన్మించిన ధనశ్రీ వర్మ ఇండియాలోనే పెరిగింది. సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ గా, డ్యాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యింది. ఆమె కొరియోగ్రాఫర్‌గా మారడానికి ముందు డెంటిస్ట్. నివేదికల ప్రకారం ధనశ్రీ వర్మ ఆస్తులు రూ.24 కోట్లు అని సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, మ్యూజిక్ వీడియోలలో కనిపించడం ద్వారా సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో పాటు, ఆమెకు యూట్యూబ్‌లో 2.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నెట్టింట ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
?igsh=bno4Z2Zpcm9ia2Vn