BigTV English

IND vs NZ Finals: టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్స్ కు వర్షం అడ్డంకి ?

IND vs NZ Finals: టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్స్ కు వర్షం అడ్డంకి ?

IND vs NZ Finals: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు ఫైనల్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తెలపడబోతున్నాయి. ఈ బిగ్ ఫైట్ కి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. గ్రూప్ దశ నుండి ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కీ దూసుకు వచ్చిన రోహిత్ సేన.. ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది టీమిండియా.


 

ఇప్పుడు ఫైనల్ లోను అదే పర్ఫార్మెన్స్ నీ రిపీట్ చేసి న్యూజిలాండ్ జట్టును ఓడించాలని భావిస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో న్యూజిలాండ్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ కీ దూసుకు వచ్చింది. సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది న్యూజిలాండ్. తమకు అచ్చోచ్చిన దుబాయ్ లో అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతోంది భారత జుట్టు. కానీ ఇప్పుడు ఈ ఇరుజట్లను కలవరపెడుతున్నాడు వరుణుడు.


భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ వరుడు ఆటంకం కలిగిస్తే ఏ జట్టు ఛాంపియన్ అవుతుంది..? అసలు ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయి..? అనేవి చూస్తే.. ఇప్పటివరకు అయితే ఫైనల్ మ్యాచ్ కి వర్షం ముప్పు ఎదురయ్యే పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా 100 ఓవర్ల మ్యాచ్ సాధ్యమేనని చెబుతున్నారు.

కానీ దుబాయ్ లో ఈ మధ్య వాతావరణం అంచనాలకు అందని విధంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే.. రిజర్వ్ డే ఏర్పాటు చేసుకునే నిబంధన ఉంది. దీంతో ఆదివారం రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిపోతుందో.. సోమవారం రోజు అక్కడి నుండే మళ్లీ ప్రారంభిస్తారు. కానీ సోమవారం కూడా వరుణుడు ఆటంకం కలిగిస్తే.. రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తారు.

అయినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే మరో రెండు గంటలు ఎదురు చూస్తారు. అయినప్పటికీ వర్షం తగ్గకపోతే ఎరుజట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఐసీసీ సూపర్ ఓవర్ కి కూడా అవకాశం కల్పిస్తారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంతకుముందు ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఇలానే వర్షం కారణంగా రద్దు అయ్యింది.

 

2002 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. రిజర్వ్ డే కేటాయించారు. కానీ రెండు రోజులు కూడా వర్షం కురిసింది. అప్పుడు కూడా ఇండియా ఫైనల్ కి చేరింది. ఈ ఫైనల్ లో శ్రీలంక జట్టుతో తలపడింది. కానీ రెండు రోజులపాటు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఇరుజట్లను విజేతలుగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం భారత్ నాలుగోసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కి చేరింది. దీంతో ఇప్పుడు భారత్ కి మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలిచే అవకాశం వచ్చింది.

Tags

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×