Team India : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో సేమ్ టీమ్ తో బరిలోకి దిగిన టీమిండియా… అద్భుత విజయాలు సాధించింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్ బాగానే రాణిస్తున్నారు. అయితే… సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలర్లకు స్వర్గధామం అయిన పెర్త్ పిచ్ పై అదనపు ఫాస్ట్ బౌలర్ అవసరం ఉండటంతో… అశ్విన్ స్థానంలో పేసర్ హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. భువీ, షమి, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యాతో పాటు… జట్టులో హర్షల్ పటేల్ కూడా చేరితే… ఐదుగురు ఫాస్ట్ బౌలర్లతో సఫారీలకు కళ్లెం వేయవచ్చని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.
అయితే, బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగబోతోంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలమైనా… అతణ్నే కొనసాగించాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. రాహుల్ ను పక్కనపెట్టి రోహిత్ తో పాటు పంత్ ను ఓపెనింగ్ కు పంపుతారా? అని మీడియా ప్రశ్నించినప్పుడు… అలాంటిదేమీ లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ క్లారిటీ ఇచ్చాడు. రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని… ఓపెనింగ్ జోడీని మార్చే ఉద్దేశం లేదని చెప్పాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ కు మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు