Big Stories

Glenn Phillips : అథ్లెట్ లా మారిన సెంచరీ హీరో

Glenn Phillips : ఆటగాడు అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలన్న మాటను నిజం చేశాడు… న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ లో నిజమైన జెంటిల్మెన్ లా ఎలా వ్యవహరించాలో… మాటల్లో కాదు… చేతల్లో చేసి చూపించాడు. అతని ప్రవర్తనకు క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన గ్లెన్ ఫిలిప్స్… క్రీజ్ లోనూ సూపర్ అనేలా వ్యవహరించి అందరి చేతా ప్రసంశలు అందుకుంటున్నాడు. క్రికెట్ లో తీవ్ర వివాదాస్పదమైన మన్కడింగ్ కు ఇకపై తావులేకుండా ఉండాలంటే ఏం చేయాలో… అదే చేసి చూపించాడు… గ్లెన్ ఫిలిప్స్.

- Advertisement -

నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్… బౌలర్ బంతి విసరకముందే పరుగు కోసం ముందుకు దూసుకెళ్లడం… క్రికెట్ లో చాలా ఏళ్లుగా వివాదానికి కారణమవుతోంది. దాంతో… ఇటీవలే మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ… దాన్ని చట్టబద్ధం చేసింది… ఐసీసీ. ఆ తర్వాత కూడా బౌలర్ బంతి విసరక ముందే క్రీజు దాటి ముందుకు పరుగెత్తడం ఆపడం లేదు… బ్యాటర్లు. కొందరు బౌలర్లు క్రీడా స్ఫూర్తితో అలాంటి బ్యాటర్లను హెచ్చరించి వదిలేస్తే… మరికొందరు బౌలర్లు రనౌట్ చేస్తున్నారు. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా… అందరికీ చక్కని పరిష్కారం చూపించాడు… గ్లెన్ ఫిలిప్స్.

సాధారణంగా బౌలర్ బంతిని విసరడానికి ముందు… క్లీజ్ లో బ్యాట్ పెట్టి ముందుకు నిలుచుంటారు… బ్యాటర్లు. దాంతో బౌలర్ బంతి విసరక ముందే ముందుకెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఫిలిప్స్ కొత్తగా ఆలోచించాడు. ఒక కాలు క్రీజులో పెట్టి… బ్యాట్ ను ముందుకు చాచి నిలబడి… బౌలర్ బంతి విసరగానే పరుగు కోసం ప్రయత్నించాడు… ఫిలిప్స్. ఒకరకంగా చెప్పాలంటే… పరుగు పందాల్లో అథ్లెట్లు ఎలాగైతే ముందుకు వంగి నిలబడి పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటారో… ఫిలిప్స్ అచ్చంగా అలాగే చేశాడు. దాంతో… అతను వ్యవహరించిన తీరు సూపర్ అని చూసిన వాళ్లంతా ప్రసంశిస్తున్నారు. క్రికెటర్లంతా ఇలాగే చేస్తే… క్రికెట్ నుంచి మన్కడింగ్ అనే వివాదాన్ని తుడిచిపెట్టేయవచ్చని చెబుతున్నారు. అందరి ప్రసంశలు అందుకుంటున్న ఈ విధానాన్ని… ఎంతమంది బ్యాటర్లు పాటిస్తారో చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News