EPAPER

Congress : మునుగోడులో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే ప్రచారాస్త్రం

Congress : మునుగోడులో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే ప్రచారాస్త్రం

Congress : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ స్పీడ్​పెంచుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు రాహుల్​ గాంధీ జోడో యాత్రను సక్సెస్​ చేస్తూనే.. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒక బృందం రాహుల్ ​వెంట ఉంటే.. మరో బృందం ఉపఎన్నిక ప్రచారం చేస్తోంది. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో మునుగోడులో తిరుగుతున్నారు. భారత్​ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత ముఖ్య నేతలు మునుగోడుకు వెళ్లలేదు. ప్రచారం కీలక దశకు చేరుకోవడంతో కీలక నేతలు వంతుల వారీగా ప్రచారానికి దిగారు.


ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్​ నడుస్తోంది. ఇరుపార్టీలు పరస్పరం నిందించుకుంటున్నాయి . ఈ నేపథ్యంలో రెండు పార్టీల వ్యవహారాన్ని కాంగ్రెస్​ అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్​ చేస్తోంది. వ్యూహం ప్రకారం ఉపఎన్నిక ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోల ఎపిసోడ్ ను ప్రధానాస్త్రంగా తీసుకుని, విస్తృతంగా గ్రామస్థాయిలో ప్రచారం చేయడానికి పావులు కదుపుతోంది. ఈ వ్యవహారం హస్తం పార్టీకి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు టీఆర్ఎస్ కాంగ్రెస్‌‌తోనే పోటీ అంటోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వినియోగించుకుంటే కాంగ్రెస్ మంచి ఫలితం సాధించటం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత్​ జోడో యాత్రలో ఉన్న పార్టీ నేతలు మునుగోడు బాట పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఉదయం మునుగోడులో ప్రచారం చేసి, సాయంత్రం భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. ఇదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్యనేతలు ఉదయం భారత్ జోడో యాత్రలో పాల్గొని సాయంత్రం వేళ ​మునుగోడుకు వెళతారు. ఇలా ప్రచారపర్వంలో స్పీడ్​పెంచుతున్నారు. మొన్నటి వరకు రాహుల్​గాంధీతోపాటు పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు ఇప్పుడు మునుగోడు ప్రచారంలో ఉన్నారు. ఇలా పార్టీ నేతలంతా మునుగోడు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ​పార్టీ సీనియర్లు, టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కోసం దాదాపు 600 ఎకరాల్లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇక్కడ పార్టీ నేతలు బస చేస్తారు. అత్యవసరంగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు ఒకేసారి 600 మందితో సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేశారు.

మునుగోడులో అందరికంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారం చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. దీంతో కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించాలని నేతలు ఓటర్లను కోరుతున్నారు.


Related News

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Delivery boy: ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి.. వివాహితపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం!

Duleep Trophy: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

Big Stories

×