BigTV English

Chennai Super Kings : 3 సార్లు.. వరుసగా నాలుగేసి మ్యాచ్‌ల ఓటమి.. చెన్నై చెత్త రికార్డులు…

Chennai Super Kings : 3 సార్లు.. వరుసగా నాలుగేసి మ్యాచ్‌ల ఓటమి.. చెన్నై చెత్త రికార్డులు…


Chennai Super Kings : ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. చెన్నై జట్టుతో ఆడడం అంటేనే.. ప్రత్యర్థికి చాలా పెద్ద మ్యాచ్ కింద లెక్క. అందునా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ. పైగా నాలుగు సార్లు టైటిల్స్ సాధించి, చాలాసార్లు ఫైనల్ వరకు వెళ్లిన జట్టు. కాని, అలాంటి జట్టును వణించిన టీమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఓడించడం కాదు.. వరుసపెట్టి చెన్నైని ఓడించిన టీమ్స్ ఉన్నాయి.

1. రాజస్తాన్ చేతిలో వరుస 4 మ్యాచుల్లో ఓటమి
2021 సీజన్‌లో రాజస్తాన్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది చెన్నై. అబుదాబిలో జరిగిన ఆ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఛేజింగ్ దిగిన రాజస్తాన్.. 17.3 ఓవర్లలోనే చెన్నైని ఓడించింది.2022లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఇక ఈ సీజన్లోనూ వరుసగా రెండు మ్యాచ్‌లు రాజస్తాన్ చేతిలోనే ఓడింది.  175 చేసి చెన్నైకి బ్యాటింగ్ అప్పగించిన రాజస్తాన్.. ఓ మ్యాచ్ దాదాపు ఓడిపోయినంత పనైంది. ఆఖరి ఓవర్లో సందీప్ శర్మ వేసి అద్భుత బౌలింగ్ కారణంగా చెన్నై ఓడిపోయింది. ఇక రీసెంట్ గా జైపూర్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై మాత్రం 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.


2. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వరుస 4 మ్యాచుల ఓటమి
సర్‌ప్రైజింగ్ గా అనిపించొచ్చు గానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా వరుసగా 4 మ్యాచులలో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. 2020-2021 సీజన్లలో ఇది జరిగింది. దుబాయ్ లో జరిగిన 2020 ఎడిషన్లో ఢిల్లీ 175 పరుగులు చేస్తే చెన్నై కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సీజన్లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి చెన్నైని ఓడించింది. ఇక 2021 లీగ్ లో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 189 పరుగులు లక్ష్యాన్ని చేధించలేక ఢిల్లీ చేతిలో చెన్నై ఓడింది. సెకండ్ ఆఫ్‌లో దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై కేవలం 136 పరుగులే చేస్తే.. ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో చేధించింది.

3. ముంబై చేతిలో వరుసగా 5 మ్యాచులలో ఓటమి
ఐపీఎల్‌లో రియల్ రైవలరీ ఉన్న జట్లు ముంబై, చెన్నై. టైటిల్ పోరు అంటే ఈ రెండింటి మధ్యే. అలాంటిది 2018-2019 సీజన్స్ లో వరుసగా ఐదు సార్లు ముంబై చేతిలో ఓడిపోయింది చెన్నై. 2018 ఎడిషన్లో పుణె గ్రౌండ్‌లో, 2019 సీజన్లో జరిగిన రెండు లీగ్ మ్యాచులతో పాటు క్వాలిఫయర్లోనూ చెన్నైని ఓడించింది. అదే సీజన్లో ఫైనల్ మ్యాచ్‌లోనూ చెన్నైని ఓడించి టైటిల్ గెలిచింది ముంబై. అలా వరుసగా ఐదు మ్యాచులలో ముంబై చేతిలో చెన్నై ఓడిపోయింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×