Big Stories

India Maldives News: మాల్దీవుల్లో డ్రా‘గన్‘ భారత్ కి ముప్పుందా?

Chinese Marine Research Ship Back In Maldives Waters: అయ్యింది.. అనుకున్నట్టే అయ్యింది. చైనా ఆశించింది.. మాల్దీవులు కావాలనుకుంటోంది. జరగనే జరిగింది. మాల్దీవుల్లో మయిజ్జూ గద్దెనెక్కినప్పటి నుంచి ఎత్తుకున్న చైనా రాగం. ఇప్పుడు మనకు డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇప్పుడు అక్కడి హార్బర్లలో చైనా రీసెర్చ్ షీప్స్ తిష్టవేశాయి. రీసెంట్‌గా మాల్దీవుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ మయిజ్జూ పార్టీ ఘన విజయం సాధించింది. 93 స్థానాలుంటే.. అందులో 66 స్థానాలు గెలుచుకుంది మయిజ్జూ పార్టీ .. ఇంకేముంది తన చేతికందిన అధికారంతో చైనాకు అన్ని విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దాని ఫలితమే ప్రస్తుతం మాల్దీవుల్లో తిష్ట వేసిన జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ అనే షిప్..

- Advertisement -

జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ అనేది చైనాకు చెందిన రీసెర్చ్ షిప్.. 100 మీటర్ల పొడవుండే ఈ షిప్ చైనా ఓషియానిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందినది. 4 వేల 500 టన్నులు దీని బరువు. డీప్‌ సీ సర్వే చేయడం దీని స్పెషాలిటీ.. మైక్రోబయల్ జెనెటిక్ స్టడీస్.. అండర్ వాటర్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, అండర్ వాటర్ లైప్‌ అండ్ ఎన్విరాన్మెంటన్ స్టడీస్ చేస్తుంది.

- Advertisement -

అయితే ఇదంతా చైనా చెబుతుంది. బట్.. కొన్ని డిఫెన్స్ సైట్స్ ప్రకారం. ఇది మెరెన్ రీసెర్చ్ షిప్ అన్నది నిజమే.. కానీ చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో నిర్మించిన షిప్‌ అని చెబుతుంది. దీనినీ రీసెర్చ్‌తో పాటు చాలా పనులకు ఉపయోగించవచ్చన్నది అనుమానం. ఒక్కసారి జర్నీ స్టార్ట్ చేస్తే.. 15 వేల నాటికల్ మైల్స్‌ ఆగకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లగలదు. ఈ డిటెయిల్సే ఇప్పుడు కాస్త అనుమానాలు పెంచుతున్నాయి.

Also Read: కలల ప్రపంచం వోవెన్.. ఫ్యూచర్ సిటీ విశేషాలు..

ఇలాంటి రీసెర్చ్ షిప్ ఎందుకు వచ్చింది అంటే.. మాల్దీవుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. ముయిజ్జూ గెలిచిన కొన్ని రోజుల తర్వాతే ఈ చైనా షిప్‌ మళ్లీ మాల్దీవుల్లో కనిపించడంపైనే ఇప్పుడు చర్చ. నిజానికి ముయిజ్జూ గతేడాది ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు.. అధికారంలోకి రాగానే మాల్దీవుల్లో ఉన్న ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది దేశం వదిలిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్లి, ఆ దేశంతో సైనిక ఒప్పందంతో పాటు మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నాడు.ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఇండియా వ్యతిరేక చర్యలను తీసుకుంటున్నాడు. అయితే ఇది మాల్దీవుల అంతర్గత వ్యవహారమైనా ఈ దేశం లక్షద్వీప్‌లకు కేవలం 70 నాటికల్ మైల్స్‌ దూరంలో ఉండటమే ఇప్పుడు అనేక సమస్యలకు కారణమైంది.

చైనా తన రీసెర్చ్ షీప్స్‌ ద్వారా భారత్‌పై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఇండియా కీలక ప్రయోగాలు చేసిన సమయంలో శ్రీలంకకి కూడా ఇలాంటి రీసెర్చ్ షిప్స్‌ను పంపించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఈ షిప్‌ కూడా జనవరి నుంచి మాల్దీవుల చుట్టే చక్కర్లు కొడుతుంది. ఇదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

ఎందుకంటే మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్‌కి అంత మంచిది కాదు. మాల్దీవులు మన లక్షదీవుల్లోని మినికాయ్ ద్వీపానికి కేవలం 70 నాటికన్ మైళ్ల దూరంలో ప్రధాన భూభాగానికి 300 నాటికన్ మైళ్ల దూరంలో ఉంది. ఈ రూట్‌ రవాణాకు చాలా కీలకం. దీంతో దీనిపై ఆధిపత్యం పెంచుకోవాలన్నది చైనా ఆలోచన. ఇప్పటికే ఈ మార్గాన్ని భారత్ నిర్వహిస్తుంది. అంతేకాదు లక్షద్వీప్‌లో భారత్ బేస్‌ల నిర్మాణాన్ని ముమ్మరం చేసింది. దీనిపై కూడా చైనా ఓ కన్నేసి ఉంచాలని చూస్తుంది.అందుకే తరుచుగా రీసెర్చ్‌ షిప్స్‌ను భారత్‌ దగ్గరగా తిప్పుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Also Read: ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మద్యానికి బానిసయ్యా’: జో బైడెన్ 

ప్రస్తుతం లక్షద్వీప్‌లో ఇండియన్ నేవీ ఓ బేస్‌ను విస్తరిస్తుంది. అది కూడా అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గానికి అతి దగ్గరలో ఈ బేస్ ఉంది. ఇందులో రాఫేల్ యుద్ధ విమానాలను మోహరించేలా డెవలప్ చేస్తున్నారు. దీంతో ఇటు మాల్దీవ్స్‌కు, అటు చైనాకు వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే మొన్న మయిజ్జూ కాళ్ల బేరానికి వచ్చినట్టు కనిపించారు.

తాము భారత్‌కు వ్యతిరేకం కాదంటూ ప్రకటనలు చేశారు. కానీ మళ్లీ ఎన్నికల్లో గెలవగానే.. మళ్లీ మొదటికొచ్చారు. ఏకంగా చైనా షిప్స్‌కు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం చైనా అండ చూసుకొని రెచ్చిపోతుంది మాల్దీవ్స్‌. చైనాతో భారత్‌కు థ్రెట్ ఉందన్న విషయం తెలిసి కూడా.. మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలను తీసుకుంటోంది. కానీ చైనాతో స్నేహం.. ధ్రుతరాష్ట్ర కౌగిలి అనే విషయం తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతోంది మయిజ్జూకు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News