Chitrapuri Housing Society : సినిమా కార్మికుల కోసం ఓ కాలనీ. అక్కడ వారికి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్. ఇదో గొప్ప ప్రయత్నం. ఇంత గొప్ప ఉద్దేశం 1994లో స్టార్ట్ అయింది. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అంటూ ఏర్పడి సినిమా వాళ్ల కోసం అపార్ట్‌మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు తాజాగా హై రైజ్ అపార్ట్‌మెంట్ కట్టారు. ఇప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్స్ ను సినీ కార్మికులకు అమ్మాలి.
ఈ ఫ్లాట్స్ ను అమ్మే ప్రక్రియా అంతా కూడా చిత్రపురి హౌసింగ్ సోసైటీ చూసుకుంటుంది. ప్రస్తుతం చిత్రపూరి హౌసింగ్ సోసైటీ అధ్యక్షుడిగా అనిల్ వల్లభనేని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రపురి ఫ్లాట్స్ అమ్మకాల విషయంలో వినిపిస్తున్న వార్తలు ఆందోలనలకు గురి చేస్తున్నాయి.
4,000 SFT నుంచి 6,999 SFT వరకు పెంచారా ?
ఈ ఫ్లాట్స్‌ను నిజానికి ఒక్క స్క్వేర్ ఫీట్ కి 4000 వేల రూపాయలకు అమ్మాల్సి ఉందట. అందులో 2000 రూపాయలు స్థలానికి… మరో 2000 వేల రూపాయలు నిర్మాణ ఖర్చులుగా ఉన్నాయట. కానీ, ప్రస్తుతం ఆ ధరను 6999 రూపాయలకు పెంచేసినట్టు తెలుస్తుంది. 4000 వేల రూపాయలకు స్క్వేర్ ఫీట్ అంటేనే సామాన్యలకు కష్టమైన ధర. అలాంటిది ఇప్పుడు దాన్ని ఏకంగా 6999 వేల రూపాయలకు పెంచారనే వార్తలు ఇప్పుడు చిత్రపూరిలో వినిపిస్తున్నాయి. సినీ కార్మికులు ఇప్పుడు ఒక్క స్క్వేర్ ఫీట్ 6999 వేల రూపాయలను పెట్టికొనగలిగే స్థోమతలో ఉన్నారంటరా ?
ఇక్కడి ఫ్లాట్స్ తానా సభల్లో NRIలకు అమ్ముతున్నారా ?
చిత్రపురి ఫ్లాట్స్‌ను సినీ కార్మికులకు అందకుండా ధరను 4000 SFT నుంచి 6999 SFT పెంచడం ఒకటి అయితే.. మరో వార్త కూడా వినిపిస్తుంది. ఈ చిత్రపూరి ఫ్లాట్స్ ను ఇక్కడ సినీ జనాలకు కాకుండా.. తానా సభల్లో NRI లకు అమ్మి.. సోమ్ము చేసుకోవలాని చూస్తుందట చిత్రపూరి హౌసింగ్ సోసైటి.
అందుకోసం సోసైటీ వాళ్లు తానా సభలకు కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా సోసైటీ ఖర్చులతో తానా సభలకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు చిత్రపూరిలో సర్క్యూలేట్ అవుతుంది. దీంతో సోసైటీపై వ్యతిరేకత వస్తుంది.
చిత్రపురిలో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్స్ పేద సినీ కార్మికుల కోసమా ? లేక విదేశాల్లో సెటిల్ అయినా.. NRIల కోసమా ? అనే ప్రశ్నలు ఇప్పుడు చిత్రపూరిలో వినిపిస్తున్నాయి. మరి ధరల పెంపు, తానా సభల్లో NRI లకు ఫ్లాట్స్ అమ్మడం లాంటివి నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత చిత్రపూరి హౌసింగ్ సోసైటీ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేనికే ఉంది. మరి ఆయన దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.