Shreyas Iyer Racing : ప్రముఖ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అతను గతంలో ఢిల్లీ తరపున ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్స్ కి చేర్చాడు. గత సీజన్ లో కోల్ కతా నైడర్స్ తరపున ఆడి కోల్ కతా నైట్ రైడర్స్ కి ట్రోఫీ అందించాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ టీమిండియా తరపున టెస్టు మ్యాచ్ లు కూడా ఆడుతాడని పేర్కొన్నారు. వాస్తవానికి శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్ కి సెలెక్ట్ కాలేదు. రాబోయే మ్యాచ్ లకు శ్రేయాస్ సెలెక్ట్ అవుతారని పలువురు పేర్కొనడం గమనార్హం.
రేసింగ్ సూట్ ధరించి మరీ..
ఇక ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తరువాత శ్రేయాస్ విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్ ఆటోడ్రోమ్ లోని రేసింగ్ ఈవెంట్ లో కనిపించారు. ముంబై ఫాల్కన్స్ జట్టులోని క్రికెటర్ పార్ట్ వెనుక వైపు తన సంతకం నెంబర్ 96తో రేసింగ్ సూట్ ధరించి ట్రాక్ ని తాకి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడని ఓ వార్తను వైరల్ అవుతోంది. ఐపీఎల్ ముగిసిన తరువాత అయ్యర్ ముంబై టీ-20 లీగ్ లో ముంబై ఫాల్కన్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయ్యర్ కూడా రేసింగ్ లో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆసియా యువ రేసింగ్ సంచలనాలను ప్రోత్సహిస్తుంది. పంజాబ్ కెప్టెన్ విజయవంతమైన ఐపీఎల్ సీజన్ లో 605 పరుగులు చేసి జట్టును ఫైనల్స్ లోకి తీసుకెళ్లాడు. అయినప్పటికీ టీమిండియా ఇంగ్లాండ్ తో ఆడే టెస్ట్ సిరీస్ టీమ్ లో అతన్ని పట్టించుకోలేదు మేనేజ్ మెంట్.
ఇది హాస్యాస్పదం..
ఇదిలా ఉంటే.. శ్రేయాస్ అయ్యర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసారు. ” మా అమ్మ బౌలింగ్ లో మా తండ్రి నన్ను ఔట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంపైర్ మా తండ్రి కావడం విశేషం. ఇది హాస్యాస్పదం.. అమ్మ బౌలింగ్ అద్భుతంగా ఉంది” అని క్యాప్షన్ లో రాసుకొచ్చాడు. శ్రేయాస్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతని బౌలింగ్ చేస్తుంది. ఆమె వేసిన బంతి నేరుగా వికెట్లను తాకింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పక్కనే అంఫైర్ గా తన తండ్రి ఔట్ అని ప్రకటించడంతో శ్రేయాస్ తల్లి సంబురాలు చేసుకుంది. శ్రేయాస్ అయ్యర్ అభిమానులను, క్రికెట్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. కుటుంబంతో సరదాగా గడిపే క్షణాలను పంచుకున్న శ్రేయాస్ అయ్యర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది కేవలం ఒక సరదా వీడియో అయినప్పటికీ, క్రీడల పట్ల కుటుంబ సభ్యుల మద్దతు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.