Rishabh Pant : క్రికెటర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీమిండియాలో కీలకంగా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా గాయం తరువాత అసలు ఇండియా టీమ్ కి ఆడుతాడా..? అనుకున్నారు అంతా. కానీ ఆయన అద్భుతంగా క్రికెట్ ఆడి అందరి మన్ననలు పొందుతారు. ప్రస్తుతం రిషబ్ పంత్ లక్నో జెయింట్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిషబ్ పంత్ కి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) రాముడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Nicholas Pooran IPL : సిక్స్ కొడితే ఫ్యాన్ తల పగిలింది… ఫోటోలు వైరల్
ఐపీఎల్ 2025 సీజన్ లో రిషబ్ పంత్ ఫామ్ లో కొనసాగడం లేదు. అయినప్పటికీ తన కెప్టెన్సీ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ ని విజయాల్లోకి తీసుకొస్తున్నాడు. కీలక ఆటగాళ్లు నికోలస్ పూరన్, మార్ష్, మార్క్ రమ్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉండటంతో లక్నో కి కలిసొచ్చిన అంశంగా చెప్పవచ్చు. మరోవైపు బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రతి, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుండటంతో లక్నో 6 మ్యాచ్ లలో 4 విజయాలను అందుకుంది. దీంతో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కి రూ.27కోట్లు ఇవ్వడం వేస్ట్ అంటున్నారు చాలా మంది. మరోవైపు కొందరూ మాత్రం రిషబ్ పంత్ కి రూ.27 కోట్లు కాదు.. రూ.50కోట్ల ప్లేయర్ అని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా పంత్ తన కెప్టెన్సీలో డీఆర్ఎస్ ని అద్భుతంగా వాడుకుంటున్నారు. బౌలింగ్ లో మార్పులు చేయడంలో మాస్టర్ మైండ్ చూపిస్తున్నాడు. ఫీల్డ్ ప్లేస్ మెంట్స్ అయితే టాప్ క్లాస్ అన్నారు. కానీ పంత్ బ్యాటింగ్ మాత్రం సరిగ్గా లేదు. కెప్టెన్ గా అదురగొడుతున్నాడు. కేవలం బ్యాటింగ్ లో రాణిస్తేనే కెప్టెన్ గా ముందుండి నడిపించినట్టు కాదు. బ్యాటింగ్ లో రాణించకపోయినప్పటికీ.. టీమ్ కి అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికి పైకి వస్తున్నాడు. తనకంటే మెరుగైన హిట్టింగ్ చేయగల ప్లేయర్లను ముందు పంపిస్తున్నాడు. మిచెల్ మార్ష్ టీమ్ కి దూరమైనప్పుడు తాను బాధ్యత తీసుకొని ఓపెనర్ గా వచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఏ ప్లేయర్ కూడా ఆ సీజన్ లో బాగా ఆడలేకపోయాడు. ఇక 2025లో రిషబ్ పంత్ కూడా ఆ లిస్ట్ లో చేరేటట్టు కనిపిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ పంత్ గాయం నుంచి కోలుకోని క్రికెట్ ఆడటం.. అందులో ఐపీఎల్ లో అత్యధిక ధర పలకడం గొప్ప విషయం అనే చెప్పవచ్చు. పంత్ తన ఆటను మెరుగుపరుచుకొని ఐపీఎల్ లో ఒక్కసారి లక్నో కి కప్ వచ్చేలా కృషి చేస్తే.. ఇక తిరుగు ఉండదనే చెప్పవచ్చు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">