Nicholas Pooran IPL : సిక్స్ కొడితే ఫ్యాన్ తల పగిలింది.. ఫోటోలు వైరల్ ఐపీఎల్ 2025లో అద్భుతాలే జరుగుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 245 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించి రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉంటే.. ఇక ఈ సీజన్ 26వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జెయింట్స్ గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. లక్నో తరపున కీలక ఆటగాడు నికోలస్ పూరన్ 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మార్కరమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేశాడు. దీంతో 181 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేధించింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్.
ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్ 7 సిక్స్ లు బాదాడు. పూరన్ కొట్టిన ఓ సిక్స్ కి అభిమాని గాయపడ్డాడు. నికోలస్ పూరన్ భారీ షాట్ ఆడటంతో ఓ అభిమాని తలకు బంతి తాకింది. దీంతో అతని తలకు గాయం అయింది. దీంతో గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కావడంతో అభిమానిని చికిత్స కోసం తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి బ్యాండేజీ వేశారు. అయితే స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తామని అభిమానిని తీసుకెళ్తుండగా.. తాను స్కానింగ్ కి రాను అని.. మ్యాచ్ చూస్తానని పట్టుబట్టి మరీ మ్యాచ్ ను తిలకించడం విశేషం.
ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడినటువంటి 6 మ్యాచ్ లలో 215 స్ట్రైక్ రేట్ తో 349 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ లో పూరన్ బ్యాట్ నుంచి 26 ఫోర్లు, 31 సిక్సర్లు బాదాడు. మొత్తం 6 మ్యాచ్ లలో కలిపి అతను 4 అర్థ సెంచరీలు కూడా చేశాడు. గుజరాత్ జట్టు పై లక్నో విజయం సాధించడంతో 6 స్థానంలో ఉన్న లక్నో జట్టు 3వ స్థానానికి.. మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ 2వ స్థానానికి చేరుకుంది.