Moringa for Hair: మునగ కాయల నుంచి కాండం, వేర్ల వరకు పనికి రానిదంటూ ఏదీ ఉండదు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందట. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయట. ఇది ఎలా సహాయపడుతుంది, జుట్టు పెరగడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం..
మునగ ఆకులలో A, C, E వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. విటమిన్-ఎ స్కాల్ప్‌లో సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుందట.
జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. మునగ ఆకులలో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. జుట్టును బలోపేతం చేయడంలో
ఇవి సహాయపడతాయట. అంతేకాకుండా జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మునగలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. మాడు భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడాలంటే మునగ ద్వారా తయారు చేసిన నూనెను వాడడం ఉత్తమం. ఇది వెంట్రుకల కుదుళ్లను బలంగా మారుస్తుంది.
మునగకాయలలో జింక్, ఐరన్ అధికంగా ఉంటాయట. జుట్టు ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. జింక్ జుట్టు పెరుగుదలను హెల్ప్ చేస్తుంది. ఐరన్ హెయిర్ ఫోలికల్స్‌కు సరైన ఆక్సిజన్ సరఫరాను నిర్ధారిస్తుంది.
ALSO READ: యూరిక్ యాసిడ్ తగ్గాలంటే..?
మీరు మొరింగ నూనెను నేరుగా మీ తలకు రాసుకోవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. స్కాల్ప్‌కు పోషణ అందించడానికి ఈ ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేయాలి.
మోరింగా టీ తాగడం వల్ల జుట్టు లోపలి నుండి పోషణ అందుతుందట. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఖనిజాలు జుట్టు పెరుగుదలతో పాటు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. మునగ ఆకులను నానబెట్టి లేదా వేడి నీటిలో మోరింగ పొడిని ఉపయోగించి టీని తయారు చేయవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.