Sanju Samson Vs Vaibhav Sooryavanshi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మొదటి మ్యాచ్ రద్దు కాగా, ఇవాళ సాయంత్రం రెండో టి20 (England vs India, 2nd T20I) జరగనుంది. మాంచెస్టర్ వేదికగా (Emirates Old Trafford, Manchester) ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టి20 సాయంత్రం ఏడు గంటలకు ఉండనుంది. మొన్న రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగా, ఇవాళ మాత్రం ఏడు గంటలకు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో సంజు శాంసన్ వివాదంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో విషప్రచారం జరుగుతోంది. రెండో టి20 కోసం ప్రాక్టీస్ సెషన్ జరగగా… ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) మెడలు పట్టుకుని ఓపెనర్ సంజు శాంసన్ (Sanju Samson) బెదిరించాడని తెలుస్తోంది. ఈ మేరకు బెదిరింపులకు సంబంధించిన ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. తుది జట్టులో వైభవ్ తనకు అడ్డుగా ఉన్నాడన్న ఒక్క కారణంతో.. సంజు తెగించినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఐర్లాండ్, ఇంగ్లాండు సిరీస్ లకు సెలెక్ట్ అయిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ… సంజు శాంసన్ కు పోటీగా తయారయ్యాడు. మొన్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అద్భుతంగా రాణించి… హీరోగా మారిన సంజు ను క్రమ క్రమంగా జీరో చేస్తున్నాడు. వైభవ్ దెబ్బకు.. సంజు శాంసన్ వరల్డ్ కప్ సందర్భంగా ఆడిన ఇన్నింగ్స్ అందరూ మర్చిపోయి… 15 ఏళ్ల బుడ్డోడి జపం చేస్తున్నారు. వెంటనే సంజు శాంసన్ ను తొలగించి వైభవ్ ను ఆడించాల్సిందేనని తెగ పోస్టులు పెడుతున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఇదే పాట పాడుతున్నారు. దీంతో గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ ఇద్దరు తలలు పట్టుకుంటున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం మాంచెస్టర్ వేదికగా ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా సంజు… వైభవ్ తో సీరియస్ గా వ్యవహరించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రతిసారి తన స్థానంలో వైభవ్ ను ఆడించాలని ట్రోలింగ్ చేస్తున్న విషయాన్ని మనసులో పెట్టుకున్న సంజు… ఆ కుర్రాడిని బెదిరించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్టులు వైరల్ అయిన నేపథ్యంలో సంజు అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. తమ సంజు… అలాంటివాడు కాదని పేర్కొంటున్నారు. వైభవ్ సూర్య వంశీకి సలహా సూచనలు ఇస్తున్నాడు తప్ప… అతని బెదిరించడం లేదని కౌంటర్లు పేల్చుతున్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది