E-Paper
Advertisement

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్
Advertisement

Yograj Singh On MS Dhoni Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) నేపథ్యంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) సంచలన ప్రకటన చేశాడు. 19 సంవత్సరాల తన ఐపీఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. ధోని రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అవుతున్నారు. పాకిస్తాన్ మాజీలు కూడా ధోని కెప్టెన్సీ, రికార్డులను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ( Yograj Singh ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ధోని రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సానుభూతి ప్రకటించలేనని బాంబు పేల్చాడు. తన కొడుకు యూవీ అంతర్జాతీయ క్రికెట్ జీవితాన్ని ధోని నాశనం చేశాడని ఫైర్ అయ్యాడు. ధోని లేకుంటే మరో నాలుగు, ఐదు సంవత్సరాలు టీమిండియాను యువరాజ్ సింగ్ ఏలేవాడు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ధోనిని జ‌న్మ‌లో తాను క్ష‌మించ‌బోన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో ధోని రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రేపుతున్నాయి.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

యువ‌రాజ్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడడం గొప్పతనమేనని పేర్కొన్నాడు. మూడు సంవత్సరాల కిందట ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే… అతడికి మంచి పేరు వచ్చేదని తెలిపాడు. 45 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే… ఏం లాభం అంటూ ఎద్దేవా చేశాడు. ఒక క్రికెటర్ గా మహేంద్ర సింగ్ ధోనీని తాను గౌరవిస్తానని యోగరాజ్ సింగ్ వెల్లడించాడు. కానీ తన కుమారుడు యువరాజు సింగ్ కు అతడు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేన‌ని.. అతన్ని జన్మలో క్షమించ బోనంటూ బాంబు పేల్చాడు.

Advertisement

తన కొడుకు యువరాజు సింగ్ దాదాపు నాలుగైదు సంవత్సరాలు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించేవాడని… కానీ కెప్టెన్ గా ఉన్న ధోని సరిగ్గా అవకాశాలు ఇవ్వలేదని మండిపడ్డాడు. సెలెక్టర్లతో యువరాజ్ సింగ్ ప్రదర్శన పై ధోని తప్పుడు సమాచారం ఇవ్వడంతో తన కొడుకు కెరీర్ నాశనమైందని ఫైర్ అయ్యాడు. లేకపోతే తన కొడుకు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరే వాడని వెల్లడించాడు. 2007 సమయంలో కూడా ధోని కారణంగా యువ‌రాజ్ సింగ్ కు కెప్టెన్సీ రాలేదని తెలిపాడు. ధోని టీమిండియాలోకి రాకుంటే కచ్చితంగా యువరాజ్ కెప్టెన్ అయ్యేవాడ‌న్నాడు. కెప్టెన్ అయింటే టీమిండియాకు ఎన్ని ట్రోఫీలు తెచ్చేవారని గుర్తు చేశాడు. క్యాన్సర్ తో పోరాడి 2011 ప్రపంచ కప్ అందించిన యువరాజ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

అక్క‌డే య‌శ్వీర్ గౌడ్ ప‌ళ్లు హంజా రాల‌గొట్టుంటే.. టీమిండియా త‌ల దించుకునేది

విరాట్ కోహ్లీకి ఇంత డ‌బ్బు పిచ్చా…బాటిల్ స్టిక్క‌ర్ తీసేసి మ‌రీ దొరికిపోయాడు!

ఆంధుల ఆసియా కప్.. టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ, రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసిన ప్లేయర్లు

ట్రావిస్ హెడ్, స్టార్క్ ఔట్.. ఐపీఎల్ 2027లో 10 ఫ్రాంచైజీలు వదిలేసిన ప్లేయర్లు వీళ్లే

ఫ్యాన్స్ బిగ్ షాక్…ఐపీఎల్ కు మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భార‌త్, పాక్ కెప్టెన్లు..అంధుల ఆసియా క‌ప్ పై ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

ఆర్య‌వీర్, సెహ్వాగ్ ఇద్ద‌రూ దొంగ‌లే..వీడియో కాల్ పేరుతో పాకిస్తాన్ ను బ‌క‌రా చేశారు

Big Stories

Advertisement
×