Aakash Chopra On CSK Player Abuse MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 19 సంవత్సరాలు ఈ టోర్నమెంట్ లో కొనసాగిన మహేంద్రుడు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ఐదు ట్రోఫీలు కూడా అందించాడు. అయితే అలాంటి గొప్ప క్రికెటర్ ధోని రిటైర్మెంట్ నేపథ్యంలో మాజీలతో పాటు తోటి క్రికెటర్లు, పాక్ ఆటగాళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. అతని రిటైర్మెంట్ బాధాకరమని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సంచలన విషయాన్ని బయట పెట్టాడు.
2023 ఐపీఎల్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అదే జట్టుకు సంబంధించిన ఓ యంగ్ కుర్రాడు బండ బూతులు తిట్టాడని వెల్లడించాడు. ఆ కుర్రాడు డ్రెస్సింగ్ రూమ్ లోనే అవమానించినప్పటికీ… ధోని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్రయోజనాల కోసం అతన్ని క్షమించాడని బాంబు పేల్చాడు. అందరిలాగా పగ తీర్చుకోలేదని.. అలాంటి గొప్ప క్రికెటర్ ధోని రిటైర్మెంట్ కావడం చాలా బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. దీంతో ధోనిపై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.