Lalit Modi On Jacob Bethell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Indian Premier League 2027 Tournament ) నేపథ్యంలో జాకబ్ బెథెల్ లాంటి డేంజర్ ప్లేయర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది. గత సీజన్ లో అడపాదడపా అవకాశాలు ఇచ్చిన ఆర్సీబీ…ఈ సారి వేలంలోకి రిలీజ్ చేసింది. దీంతో ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్సీబీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ తరుణంలోనే ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ ( Lalit Modi) దీనిపై స్పందించాడు.
అనవసరంగా జాకబ్ బెథెల్ లాంటి డేంజర్ ఆటగాన్ని వదిలేశారని పేర్కొన్నాడు. జాకబ్ ను వదిలేయకుండా వినియోగించుకుండుంటే, ఆర్సీబీ తలరాత అతనే మార్చేవాడని తెలిపాడు. జాకబ్ బెథెల్ మాములోడు కాదని.. 2030 ఐపీఎల్ నాటికి రూ.150 కోట్లు కొల్లగొడుతాడని ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేలంలోకి రాబోతున్న జాకబ్ బెథెల్ ఇకపై ఏడాది రూ. 35 కోట్లకు పైగా సంపాదిస్తాడని, ఇలా 2030 వరకు రూ.150 కోట్ల వరకు రాబడతాడని అంచనా వేశాడు. దీంతో జాకబ్ బెథెల్ పైన ( Jacob Bethell) లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.