Rashid Latif On Jay Shah: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్ లపై మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా అమిత్ షా కొడుకు జై షా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్, టీమిండియా ప్లేయర్లు తన్నుకు చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహాల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఉగ్రవాదుల చిత్రీకరించి చూపించారని మండిపడ్డాడు. ఇందులో భాగంగానే తమ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా టీమిండియా క్రికెటర్లకు ఆదేశాలు ఇచ్చారని ఫైర్ అయ్యాడు. దీంతో మనసు చంపుకొని పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా ప్లేయర్లు లోలోపన మదన పడుతున్నారని వ్యాఖ్యానించాడు. దీనంతటికి కారణం జై షా ఒక్కడేనని ఆగ్రహించాడు.
ఐసీసీ అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు తీసుకోకముందు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ప్లేయర్లు జాలిగా గడిపే వారని గుర్తు చేశాడు పాక్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif). డ్రెస్సింగ్ రూమ్ లో కూడా సరదాగా గడిపేవారని వెల్లడించాడు. ఇక ద్వైపాక్షిక సిరీస్ లు జరిగినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ల ఇళ్లల్లోకి కూడా టీమిండియా ఆటగాళ్లు వెళ్లేవారని.. బిర్యానీలు ఆరగించేవారని పేర్కొన్నాడు. చాలా సార్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ లాంటి వాళ్ల ఇళ్లల్లోకి కూడా వెళ్లి పార్టీలు చేసుకున్నట్టు వెల్లడించాడు.
కానీ ఇప్పుడే రెండు జట్ల క్రికెటర్లు పదే పదే గొడవ పడుతున్నారని ఫైర్ అయ్యాడు మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif). రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం తరహాలో దాని ట్రీట్ చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విక్టరీ కొడితే.. వరల్డ్ కప్ గెలిచిన కంటే ఎక్కువ సంబరాలు జరుగుతున్నాయని మండిపడ్డాడు. అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Asia Cup) సందర్భంగా కూడా భారత యువ క్రికెటర్లు అలాగే రెచ్చిపోయారని సీరియస్ అయ్యాడు. ఇది మంచి పద్ధతి కాదని రషీద్ లతీఫ్ తెలిపాడు. ఆ సంఘటనపై కచ్చితంగా ఐసీసీ విచారణ చేసి గొడవకు దిగిన టీమిండియా యువ క్రికెటర్ల పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif). తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడితేనే మరోసారి తప్పులు చేయరంటూ హితువు పలికారు.