E-Paper
Advertisement

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం
Advertisement

Tanveer Ahmed Warns Team India:  రైజింగ్ స్టార్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Asia Cup Rising Stars 2026) గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే టైటిల్ కూడా లాంచ్ చేశారు. ఇక నవంబర్ 22వ తేదీన రైజింగ్ స్టార్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. దీంతో అభిమానులు అందరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 22వ తేదీన టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తామంటూ సవాల్ చేశాడు. లేకపోతే తన పేరు మార్చుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

నవంబర్ 22న పాకిస్తాన్ ఓడితే.. నా పేరు మార్చుకుంటా

రైజింగ్ స్టార్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య జరుగనున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్ స్పందించాడు. నవంబర్ 22న జరిగే మ్యాచ్ తో భారత జట్టు పనైపోతుందని హెచ్చరించాడు. ఆ రోజున టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీని తొలి ఓవరలోనే ఔట్ చేస్తామని, తిలక్ వర్మ వికెట్ కూడా తీస్తే పాకిస్తాన్ అవలీలగా విక్టరీ అందుకుంటుందన్నాడు. ఆ దిశగా పాకిస్తాన్ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని వెల్లడించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

ఖతార్ వేదికగా మ్యాచ్ లు జరుగుతున్నందున పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ ఉంటుందని తెలిపాడు. ఫ్లాట్, హైవే లాంటి పిచ్ లు ఖతార్ లో ఉండబోవని, ఈ తరుణంలోనే టీమిండియా జట్టును సులభంగా ఓడించవచ్చని స్పష్టం చేశాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ జట్టును ఓడించి, యువ భారత్ ఓవరాక్షన్ చేసిందని మండిపడ్డాడు. అప్పుడు జరిగిన అవమానానికి నవంబర్ 22న ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. ఒకవేళ ఆ రోజున టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే, తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరాడు.

రైజింగ్ స్టార్ ఆసియా కప్ లోనూ టీమిండియా, పాక్ మధ్య ఫైనల్

Advertisement

రైజింగ్ స్టార్ ఆసియా కప్ టోర్నమెంట్ లోనూ టీమిండియా, పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తో పాటు ఫైనల్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్, పాక్ తప్ప మిగతా జట్లు తేలిపోతున్నాయి. ఈ తరుణంలోనే మరోసారి దాయాదుల మధ్యే ఫైనల్స్ ఉంటుందని చెబుతున్నారు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

అమిత్ షా కొడుకనే ఐసీసీ చైర్మ‌న్ కూర్చీలో జై షాను కూర్చోబెట్టారు!

2023లో ధోనిని చెన్నై ప్లేయ‌ర్లు ప‌చ్చి బూతులు తిట్టాడు..ఆకాశ్ చోప్రా సంచ‌ల‌నం

ట్రావిస్ హెడ్ పోతే ఏంటి? భ‌యంక‌ర‌మైన కాటేర‌మ్మ కొడుకుల‌ను దించుకున్న కావ్య పాప‌

జై షా కార‌ణంగా టీమిండియా, పాకిస్తాన్ క్రికెట‌ర్లు త‌న్నుకు చస్తున్నారు!

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

అక్క‌డే య‌శ్వీర్ గౌడ్ ప‌ళ్లు హంజా రాల‌గొట్టుంటే.. టీమిండియా త‌ల దించుకునేది

విరాట్ కోహ్లీకి ఇంత డ‌బ్బు పిచ్చా…బాటిల్ స్టిక్క‌ర్ తీసేసి మ‌రీ దొరికిపోయాడు!

Big Stories

Advertisement
×