IND VS AUS: ఆసీస్, టీమిండియా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st ODI ) మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రేపు పెర్త్ వేదికగా మొదటి వన్డే టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కు వరుణుడు ( Rain) విలన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. రేపు పెర్త్ వేదికగా పలుమార్లు వర్షం పడి మ్యాచ్ కు అంతరాయం కలిగే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆసీస్, టీమిండియా ( Australia vs India, 1st ODI ) మ్యాచ్ నేపథ్యంలో రేపటి రోజున వర్షం పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా టాస్ ప్రక్రియ కూడా కాస్త ఆలస్యంగా జరగనున్నట్లు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా మళ్లీ వర్షం పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట. 35 నుంచి 40% రేపటి మ్యాచ్ కు వర్షం అద్దంకిగా మారే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఆడితే చూద్దామని అనుకున్న అభిమానులకు ఈ వర్షం విలన్ గా మారిపోయింది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
టీమిండియా వర్సెస్ ఆసీస్ జట్ల రేపు పెర్త్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రేపు ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభం కానుంది. అంటే ఉదయం 8.30 గంటకు ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో తిలకించవచ్చును. గిల్ కెప్టెన్సీ టీమిండియా బరిలో దిగనుంది. అటు మార్ష్ కెప్టెన్సీలో ఆసీస్ ఆడనుంది.
ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (C ), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: మిచెల్ మార్ష్ (C ), ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్