Congress Ka Baap Rohit: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ( Champions Trophy 2025 Tournament ) సెమీ ఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యంలో… రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురించి దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. రోహిత్ శర్మ కారణంగా కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ( Congress vs BJP ) పార్టీల మధ్య… సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గా బాప్ రోహిత్ శర్మ ( Congress Ka Baap Rohit ) అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు బిజెపి పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ కా బాప్ అనే హ్యాష్ టాగ్ ను క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి మండేలాగా పోస్టులు పెడుతున్నారు కాషాయ సోషల్ మీడియా కార్యకర్తలు.
ఇప్పటికే 60 వేలకు పైగా పోస్టులు పెట్టారు. వాస్తవంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్… తాజాగా వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలు చెత్త ప్లేయర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ( Shama Mohamed ). అంతేకాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడని… అలాంటి ప్లేయర్ అసలు పనికిరాడు అంటూ ఫైర్ అయ్యారు. గతంలో సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, రాహుల్ ద్రావిడ్ అలాగే విరాట్ కోహ్లీ ఇలా బరువుగా ఎవరూ లేరని.. రోహిత్ శర్మ మాత్రం అధిక బరువుతో.. కెప్టెన్సీ చేస్తున్నాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి డిలీట్ చేశారు.
దాన్ని కప్పి పుచ్చుకునేందుకు రోహిత్ శర్మ చెత్త ప్లేయర్ అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలాగే బిజెపి కార్యకర్తలు రెచ్చిపోయి… ఆమెకు సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేసిన కామెంట్లపై రోహిత్ శర్మ అభిమానులతో పాటు… బిజెపి కార్యకర్తలు ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. దేశానికి సేవ అందిస్తున్న రోహిత్ శర్మను… ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడడం దారుణమని… నిప్పులు జరుగుతున్నారు. దేశం కోసం పోరాడే వ్యక్తులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆమెపై.. అలాగే కాంగ్రెస్ అధిష్టానం పై కూడా.. పోస్టులు పెడుతున్నారు. దీనిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మహిళా నేత షామా మహమ్మద్ ( Shama Mohamed ) ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు. మరి ఈ వివాదం పై రాహుల్ గాంధీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Congress- Rohit: ఇంత బరువు ఉన్నాడు… రోహిత్ పై కాంగ్రెస్ మహిళా నేత బాడీ షేమింగ్ కామెంట్స్ !
Even after all this, you @drshamamohd still haven’t learned your lesson and are RTing Rohit hate tweets? Apologize to Indian captain now or I’m dropping your phone number right here for everyone to see.
CONGRESS KA BAAP ROHIT pic.twitter.com/fZGeIxkTjp
— ` (@R0hitinveins) March 3, 2025