BigTV English
Advertisement

Nani: నాని సినిమాకు కొత్త రికార్డ్.. అల్లు అర్జున్ తర్వాత నేచురల్ స్టార్‌కే అది సొంతం..

Nani: నాని సినిమాకు కొత్త రికార్డ్.. అల్లు అర్జున్ తర్వాత నేచురల్ స్టార్‌కే అది సొంతం..

Nani: ఈరోజుల్లో యాక్టర్స్ మధ్యలో ఎక్కడా లేని పోటీ ఉంటుంది. సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ దగ్గర నుండి, అదే సినిమా కలెక్షన్స్ వరకు అన్ని విషయాల్లో యాక్టర్లు అంతా పోటాపోటీగా ముందుకెళ్తున్నారు. ఇక పాన్ ఇండియా అనేది వచ్చిన తర్వాత యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికే ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా అంటే ఇప్పటివరకు కేవలం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల వరకే పరిమితమయ్యింది. కానీ ఇప్పటినుండి అలా కాకుండా పాన్ ఇండియా అనగానే మరికొన్ని భాషల్లో కూడా సినిమాలు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగం చేసిన హీరోల్లో ముందు అల్లు అర్జున్ ఉండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నాని పేరు యాడ్ అయ్యింది.


అప్పుడు బన్నీ.. ఇప్పుడు నాని

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ఫ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతే కాకుండా ఈ సినిమా క్రియేట్ చేసిన ఎన్నో రికార్డుల్లో ఒక కొత్త రికార్డ్ కూడా ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా బెంగాలీ భాషలో విడుదల కాలేదు. అలాంటిది ‘పుష్ప 2’ను మాత్రం ఆ భాషలో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అందుకే వారే స్వయంగా డబ్బింగ్ బాధ్యతలను చేపట్టి బెంగాలీలో కూడా ఈ సినిమాను విడుదల అయ్యేలా చేశారు. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ‘పుష్ప 2’ బెంగాలీ భాషలో విడుదలయ్యింది. ఇప్పుడు అదే రూటును నాని కూడా ఫాలో అవుతున్నాడు.


కొత్త ప్రయోగం

నేచురల్ స్టార్ నాని కూడా తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలని, మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ‘ది ప్యారడైజ్’తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా 2026 మార్చి 26న గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే కేవలం తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో బెంగాలీ కూడా ఒకటి. బెంగాలీలో ఇప్పటివరకు కేవలం ‘పుష్ప 2’ అనే తెలుగు సినిమా మాత్రమే డబ్ అయ్యి విడుదలయ్యింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నాని (Nani) ‘ది ప్యారడైజ్’ కూడా యాడ్ అవ్వనుంది.

Also Read: నాని అనే మంచోడు ఒక్కడే ఉండేవాడు.. వాన్ని కూడా నాశనం చేశారు కదరా..

చిన్న మార్కెట్

ఇండియన్ భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల మార్కెట్లకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. అందుకే నార్త్ అంటే కేవలం బాలీవుడ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ఇండస్ట్రీ నిపుణులు. బెంగాలీ మార్కెట్ అనేది అంత పెద్దది కాదు. అందుకే ఆ భాషలో సినిమాను విడుదల చేయడానికి, దానిపై ఖర్చుపెట్టడానికి చాలావరకు మేకర్స్ ఇష్టపడరు. కానీ ‘పుష్ప 2’ వేసిన బాటలోనే ‘ది ప్యారడైజ్’ (The Paradise) వెళ్లడానికి సిద్ధమయ్యింది. అలా తెలుగు సినిమాలు బెంగాలీ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడం మొదలుపెడితే మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఆ భాషలో విడుదల అవ్వడానికి ముందుకొస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×