Teacher MLC elections: వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటివరకు మొత్తం 15 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. పీఆర్టియూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి 7673 ఓట్లతో ముందంజలో ఉన్నారు. యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 5,660 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ 5,309 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్ 3,992 ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే మొత్తం 24,136 ఓట్ల సంఖ్య నమోదవ్వగా.. అందులో చెల్లిన ఓట్లు 23,641, చెల్లుబాటు కానీ ఓట్లు 494 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 11,821గా ఉంది.
అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది బరిలో ఉండగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయినవారిలో లింగిడి వెంకటేశ్వర్లు స్వాతి, సాయన్న, పన్నాల గోపాల్ రెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్, కైలాసం, పి పురుషోత్తం రెడ్డి, బంక రాజు, వెంకట రాజయ్య, తదితరులు ఉన్నారు.