BigTV English
Advertisement

Champions Trophy 2025: ఇండియా ఆడకపోతే క్రికెట్ అంతమైపోదు .. ఛాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వ్యాఖ్యలు

Champions Trophy 2025: ఇండియా ఆడకపోతే క్రికెట్ అంతమైపోదు .. ఛాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వ్యాఖ్యలు

Champions Trophy 2025| ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై భారత్, పాకిస్తాన్ దాయాది దేశాలపై మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ హసన్ అలీ ఈ అంశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో ఇండియా ఆడేందుకు రాకపోయినా.. తాము మాత్రం కచ్చితంగా సిరీస్ ఆడుతామని చెప్పాడు.


పాకిస్తాన్‌-ఇండియా దేశాల మధ్య శత్రుత్వం, ఆ దేశంలో హింసాత్మక ఘటనలు తరుచూ జరుగుతుండడంతో భారత్ క్రికెటర్స్‌కు ప్రమాదముందని భావించి గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం టీమిండియాను పాకిస్తాన్‌లో ఆడేందుకు అనుమతించడం లేదు. గతంలో శ్రీలంక క్రికెట్ జట్టు.. పాకిస్తాన్ లో సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు వారిపై దాడులు కూడా జరిగాయి. 2008లో చివరిసారిగా టీమిండియా పాకిస్తాన్ వెళ్లి మ్యాచ్‌లో ఆడింది. ఆ తరువాత 2008లోనే ముంబైలో ఉగ్రదాడులు జరిగిన తరువాత నుంచి భారత ప్రభుత్వం టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతించడం లేదు.

Champions Trophy 2025 INDIA VS PAKISTAN


పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లకు ఇండియా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఆ దేశంలో సిరీస్ నిర్వహించినా.. ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్, శ్రీలంక లాంటి దేశాల్లో బిసిసిఐ కోరిక మేరకు ఐసిసి నిర్వహించింది. 2023 ఆసియా కప్ సమయంలో ఇలాగే జరిగింది. రాబోయే సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగనుండగా.. ఈసారి కూడా ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు దుబాయ్ లేదా శ్రీలంక దేశాల్లోనే జరుగుతాయని.. ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?

ఈ విషయాలపై పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ స్పందించారు. హసన్ అలీ ఒక పాకిస్తన్ మీడియా ఛానెల్ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. ”ఇండియన్ క్రికెటర్స్ చాలామంది పాకిస్తాన్ రావాలనుకుంటున్నారు. మాకు (పాకిస్తాన్ క్రికెటర్లు) ఇండియా వెళ్లి క్రికెట్ ఆడేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు వాళ్లు కూడా పాకిస్తాన్ రావాలి.. అప్పుడే కదా.. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. మా దేశంలో క్రికెట్ ఆడేందుకు ఇండియాన్ క్రికెటర్స్ అంతా ఉత్సాహంగా ఉన్నట్లు చాలా ఇంటర్‌వ్యూల్లో చెప్పారు. కానీ వాళ్లు ఇక్కడికి రావడానికి భారత ప్రభుత్వం, భారత క్రికెట్ బోర్డు అనుమతులు కావాలి,” అని చెప్పాడు.

మీడియా ఇంటర్‌వ్యూలో ఆయనకు ఇండియా రాకుండానే చాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ లో నిర్వహిస్తారా? అని అడిగారు. దీనిపై హసన్ అలీ దూకుడుగా సమాధానమిచ్చాడు. ”ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఇండియా వచ్చినా రాకపోయినా సిరీస్ లో జరిగే మ్యాచ్ లన్నీ పాకిస్తాన్ లోనే జరుగుతాయి. వేరే ఆప్షన్ లేదు. ఇండియా రాకపోతే .. క్రికెట్ అంతరించిపోదు కదా..,” అని అన్నాడు.

ఇంతకుముందు 2023లో పాకిస్తాన్ లో ఆసియా కప్ సిరీస్ జరిగింది. ఆ సమయంలో టీమిండియా పాకిస్తాన్ వెళ్లలేదు. ఇండియా ఆడబోయే మ్యాచ్ లను ఐసిసి ఆదేశాలతో శ్రీలంక, దుబాయ్ దేశాలలో జరిగాయి. కానీ ఆ తరువాత 2023 ప్రపంచ కప్ ఇండియాలో జరిగినప్పుడు పాకిస్తాన్ టీమ్ అసలు పాల్గొనలేదు.

ఇప్పుడు కూడా భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే.. ఇండియా ఆ తరువాత సంవత్సరం జరగబోయే 2026 T20ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్తాన్ కూడా రాదని పాక్ క్రికెట్ బోర్డు చెప్పింది.

ఈ వివాదంపై త్వరలోనే ఐసిసి సమావేశం కానుందని చర్చ జరగుతోంది.

 

Related News

Pak vs SA: రోహిత్ శ‌ర్మ రికార్డు బ‌ద్ద‌లు..టీ20 క్రికెట్ లో రారాజుగా బాబర్ ఆజం చ‌రిత్ర‌

Pro Kabaddi Final: ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ…ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

AUS vs IND: గంభీర్ త‌ప్పుడు నిర్ణ‌యాలు…రెండో టీ20లో ఆస్ట్రేలియా విజ‌యం

AUS vs IND: హ‌ర్షిత్ రాణా ఊచ‌కోత‌.. 104 మీట‌ర్ల సిక్స‌ర్..ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్

Aus vs Ind, 2nd T20I: టాస్ ఓడిన టీమిండియా..అర్ష‌దీప్ కు మ‌రోసారి నిరాశే..తుది జ‌ట్లు ఇవే

Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!

Big Stories

×