EPAPER

Gautam Gambhir: 11ఏళ్లప్పుడే ప్రతిజ్ఞ చేశా.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా : గంభీర్

Gautam Gambhir: 11ఏళ్లప్పుడే ప్రతిజ్ఞ చేశా.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా : గంభీర్

Gautam Gambhir Vowed To Win World Cup  After This India vs Australia Clash: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ రావడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇప్పటికే చేరాలి. కానీ టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఒకొక్క మెట్టు ముందుకు దూసుకుపోవడంతో అందరి ఫోకస్ అటు పడి, ఇది ఆలస్యమైంది. ఇంతలో జింబాబ్వే పర్యటనకు సమయం ఆసన్నం కావడంతో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో యువ జట్టు బయలుదేరింది.


ఇదంతా ఎందుకంటే ఇప్పుడు గౌతంగంభీర్ ఏం మాట్లాడినా నెట్టింట వైరల్ అవుతోంది. కారణం ఏమిటంటే.. టీమ్ ఇండియాకి కాబోయే హెడ్ కోచ్ ఏం మాట్లాడుతున్నాడనే ఆసక్తి అందరిలో ఉండటమే అంటున్నారు. ఇంతకీ గంభీర్ ఏమన్నాడంటే, తను 11 ఏళ్ల వయసులో చూసిన 1992 వరల్డ్ కప్ మ్యాచ్ గురించి చెప్పాడు. అది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్.

అక్కడ మనవాళ్లు ఒక్క పరుగుతేడాతో ఓటమి పాలయ్యారు. అది చూసి నాకు నిద్ర పట్టలేదు.. ఏడుస్తూనే ఉన్నానని తెలిపాడు. ఆరోజే నేనొక ప్రతిజ్ఞ చేశాను. ఎప్పటికైనా నేను వరల్డ్ కప్ కొడతానని అనుకున్నానని తెలిపాడు.


Also Read: ఆ ముగ్గురూ లేకుండానే.. జింబాబ్వే బయలుదేరిన యువ జట్టు

అనుకున్నట్టుగానే రెండు వరల్డ్ కప్ ల్లో బ్రహ్మాండంగా ఆడి, జట్టు విజయంలో గౌతం గంభీర్ కీలకపాత్ర పోషించాడు. 2007లో టీ 20 ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

అలాగే 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుతంగా ఆడి 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధోనీ నాయకత్వంలోని జట్టు 28 ఏళ్ల తర్వాత సగర్వంగా వరల్డ్ కప్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. ఈ రెండు వరల్డ్ కప్ ల్లో గౌతం గంభీర్ పాత్ర ప్రశంసనీయమైనదని చెప్పాలి.

Also Read: Rohit Sharma Phone Call To Dravid: ఆరోజు రోహిత్ ఫోన్ చేసి ఉండకపోతే: ద్రవిడ్

అలా తన చిన్ననాటి ప్రతిజ్ఞను గుర్తుచేసిన గంభీర్ మరొక్కసారి క్రెకెట్ అభిమానులకు రెండు ప్రపంచకప్ లను పరిచయం చేశాడు. అటు టీ 20, ఇటు వన్డే వరల్డ్ కప్ రెండు ట్రోఫీలు సాధించిన జట్లలో సభ్యుడిగా ఉండటం చాలా అరుదైన విషయం. అది సాధించిన వారిలో గౌతం గంభీర్ ఒకరుగా ఉన్నారు. రేపు కోచ్ గా వచ్చి 2027 వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచి తన చిన్ననాటి ప్రతిజ్ఞను మరోసారి నిలబెట్టుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×