BigTV English

Team India Zimbabwe Tour: ఆ ముగ్గురూ లేకుండానే.. జింబాబ్వే బయలుదేరిన యువ జట్టు

Team India Zimbabwe Tour: ఆ ముగ్గురూ లేకుండానే.. జింబాబ్వే బయలుదేరిన యువ జట్టు

Young Team India for Zimbabwe Tour: టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు రాకుండానే జింబాబ్వే పర్యటనకు భారత యువ జట్టు బయలుదేరింది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ ఆధ్వర్యంలో శుభ్ మన్ గిల్ నాయకత్వంలో తొలి బృందం బయలుదేరింది. జింబాబ్వేలో జులై 6 నుంచి 5 టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది.


అయితే బార్బడోస్ లో భీకర తుఫాను తాకిడితో ఇండియాకి తిరిగి రావడం ఆలస్యమైన భారత జట్టులో ముగ్గరు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వారిలో సంజూ శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ ఉన్నారు. ప్రస్తుతం వీరి స్థానంలో మొదటి రెండు మ్యాచ్ లకు సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకున్నారు. వికెట్‌ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఇషాన్‌ కిషన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

జింబాబ్వే పర్యటనలో జులై 6న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూలై 7, జులై 10, 13, 14 తేదీల్లో మగతా నాలుగు టీ 20 మ్యాచులు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.


Also Read: స్వదేశానికి టీమిండియా.. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న రోహిత్ సేన

భారత్ లో ప్రపంచకప్‌ విజయోత్సవ సంబరాలు కూడా ఉండటంతో సంజూ శాంసన్‌, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ బహుశా జులై 7వరకు ఆగనున్నారు. అయితే జులై 10న మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది.  ఆ సమయానికి వీరు జింబాబ్వే బయలుదేరి టీమిండియాతో కలిసే అవకాశాలున్నాయి.

Tags

Related News

Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో

Pro Kabaddi League 2025: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్… తొలి వాచ్ తెలుగు టైటాన్స్ దే…టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

Big Stories

×