Cristiano Ronaldo| ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డ్ సృష్టించాడు. అత్యధిక ఫీజు తీసుకునే ఫుట్ బాల్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఏడాదికి అతని ఆదాయం 275 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2353 కోట్లు). సౌదీ ప్రో లీగ్‌లో అల్-నస్సర్ క్లబ్‌తో తన ప్రయాణం ముగిసిందని కొన్ని వారాల క్రితం సూచించిన క్రిస్టియానో రొనాల్డో.. ఇప్పుడు ఆ క్లబ్‌తో కొత్తగా రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంతో అతను యురోప్ ఫుట్‌బాల్‌కు తిరిగి వెళతాడనే అన్ని ఊహాగానాలకు తెరపడింది. గత రెండు సీజన్లలో సౌదీ ప్రో లీగ్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రొనాల్డో.. అయినప్పటికీ లీగ్ టైటిల్‌ను గెలవలేకపోయాడు. అల్-నస్సర్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కారణంగా ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.
అల్-నస్సర్ వరుస వైఫల్యాలు రొనాల్డోను తన కెరీర్‌ను వేరే చోట కొనసాగించేలా ప్రేరేపించినట్లు కనిపించినప్పటికీ, గత వారంలో పరిస్థితులు బాగా మారాయి. అల్-నస్సర్ సోషల్ మీడియాలో.. “క్రిస్టియానో రొనాల్డో 2027 వరకు అల్-నస్సర్‌లో కొనసాగనున్నాడు” అని ప్రకటించింది. టాక్‌స్పోర్ట్ ప్రకారం.. రొనాల్డో ఈ ఒప్పందంతో సంవత్సరానికి 178 మిలియన్ పౌండ్లు (సుమారు 400 మిలియన్ యూరోలు లేదా రూ. 2000 కోట్లు) ఫీజు అందుకోనున్నాడు. దీంతో పాటు రొనాల్డోకు మరిన్ని విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉంటాయి.
రొనాల్డో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలు ఇలా ఉన్నాయి.
2023లో రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్-నస్సర్ క్లబ్‌లో చేరాడు. గత నెలలో, సౌదీ ప్రో లీగ్ ముగిసిన తర్వాత అల్-నస్సర్ మూడో స్థానంలో నిలిచి ట్రోఫీ గెలవలేకపోవడంతో, రొనాల్డో “ఈ అధ్యాయం ముగిసింది” అని పోస్ట్ చేశాడు.
సౌదీ ఫుట్‌బాల్‌లో పెద్ద పెట్టుబబడి దారుడైన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్)కు చెందిన ఒక ఉద్యోగి చెప్పిన మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. “రొనాల్డో ఉనికి గత రెండున్నర సంవత్సరాలలో సౌదీ లీగ్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. అతను ఎలైట్, యువ ఆటగాళ్లకు సౌదీ అరేబియాకు రావడానికి ప్రేరణగా నిలిచాడు.”
Also Read: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?
రొనాల్డో గణాంకాలు
అల్-నస్సర్ కోసం రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో 77 మ్యాచ్‌లలో 74 గోల్స్ సాధించాడు. మొత్తంగా, రియాద్‌కు చెందిన ఈ జట్టు కోసం 111 ఆటలలో 99 గోల్స్ చేశాడు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. రొనాల్డోను 2027 వరకు అల్-నస్సర్‌తో కొనసాగుతాడు.