BigTV English

India Pakistan Sachin: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?

India Pakistan Sachin: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?

India Pakistan Sachin| క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ పేరు తెలియని వారుండరు. సచిన్ అభిమానులైతే గాడ్ ఆఫ్ క్రికెట్ పేరుతో ఆయనను పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ అంటే భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడి తన ఆటతీరుతో అభిమానులను అలరించిన ఘనత కొంత మంది క్రికెటర్లకే దక్కింది. అలాంటి క్రికెటర్ల జాబితాలో సచిన్ టాప్ లో ఉంటారు. చాలా మ్యాచ్ లలో సచిన్ సింగిల్ హ్యాండెడ్ గా టీమిండియాను గెలిపించిన సందర్బాలున్నాయి. సచిన్ పేరున ఎన్నో క్రికెట్ రికార్డులున్నాయి. వాటిలో కొన్ని ఇంకా బ్రేక్ కాలేదు. ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ క్రికెట్ జరుగుతోంది. అందరూ రన్స్ బాదే వారే. సచిన్ ఎరాలో అలాంటి ఆట కాదు.. అంతా జెంటిల్‌మెన్ గేమ్. అయినా ఇప్పటికీ ఆయన రికార్డులు పూర్తిగా బ్రేక్ చేయలేకపోతున్నారు.


అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్ గా ఇంకా సచిన్ పేరునే రికార్డ్ ఉంది. పైగా వంద సెంచురీలు కూడా సచిన్ పేరునే ఉన్నాయి. సచిన్ గురించిన ఇలాంటి విషయాలన్నీ దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈ ప్రఖ్యాత బ్యాటర్ గురించిన ఒక అరదైన విషయం ఈతరం క్రికెట్ అభిమానులకు తెలియదు. అదేటంటే సచిన్ చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే అంతకుముందే సచిన్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కోసం ఆడిన సందర్భం ఉంది.

పాకిస్తాన్ కోసం క్రికెట్ ఆడిన సచిన్
కేవలం 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ 1989 సంవత్సరంలో పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన రికార్డ్ ఉంది. అది కూడా కేవలం 13 ఏళ్ల వయసులోనే. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టక ముందే సచిన్ పాకిస్తాన్ జట్టు తరపున క్రికెట్ మైదానంలో అడుగు పెట్టాడు. అది 1987వ సంవత్సరం.. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గోల్డెన్ జుబ్లీ సందర్బంగా ఒక టెస్టు సిరీస్, ఒక వన్డే అంతర్జాతీయ సిరీస్ నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా నిర్వహించారు.


ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు ఇండియా టూర్ కు వచ్చింది. అయితే ముందుగా బార్ బోర్న్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ టీమ్ ల మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ మధ్యలో పాక్ క్రికెటర్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ చేయడానికి హోటల్ కు వెళ్లారు. కానీ ఆ తరువాత వారు తిరిగి రాలేదు. మరోవైపు మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అప్పుడు పాకిస్తాన్ జట్టుకు కోసం ఒక ఫీల్డర్ తక్కువయ్యాడు. అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎవరైనా ఒక ఇండియన్ ప్లేయన్ ని సబ్‌స్టిట్యూట్ గా ఆడించాలని నిర్ణయించాడు. అప్పుడు భారత జట్టులో బౌండరీ బాయ్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ ఒక చిన్న పిల్లాడు. దీంతో ఇండియన్ టీమ్ ఆట కొనసాగించేందుకు తమ బౌండరీ బాయ్ సచిన్ చేత పాకిస్తాన్ తరపున ఫీల్డిండ్ చేయించాలని నిర్ణయించింది.

Also Read: ఏఐ వచ్చేస్తోంది.. ఈ రంగాల్లో ఉద్యోగాలుండవు.. ఫివర్ కంపెనీ సీఈఓ హెచ్చరిక

25 నిమిషాలపాటు పాకిస్తాన్ కోసం ఆడిన సచిన్
పాకిస్తాన్ తరపున టెండూల్కర్ కేవలం 25 నిమిషాల పాటు ఫీల్డింగ్ చేశాడు. సచిన్ ఒకవైపు లాంగ్ ఆన్ లో ఫీల్డిండ్ చేస్తుంటే.. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్.. సచిన్ టెండూల్కర్ వైపు ఒక షాట్ కొట్టారు. కానీ సచిన్ ఆ క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తన ఆటో బయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే ‘ లో రాసుకున్నాడు.

Also Read: నేను తిరిగి రాలేకపోవచ్చు కానీ దేశం క్షేమంగా ఉంటుంది.. వైరల్ అవుతున్న భారత జవాన్ వీడియో

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×