Viral Video: అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. సాంకేతిక లోపం కారణమని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. రెండురోజుల కిందట బ్యాంకాక్ వెళ్లాల్సి ఎయిరిండియా విమానం ఆలస్యం వెనుక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడది వైరల్‌గా మారింది.
బుధవారం జూన్ 25న ముంబైలో బ్యాంకాక్ వెళ్లాల్సింది ఎయిరిండియా విమానం. అయితే విమానం రెక్కల్లో పక్షి గూడు, దానికి సంబంధించిన కర్రలు, ఎండు గడ్డి చిక్కుకుపోయాయి. దీనివల్ల ఆ విమానం ఐదు గంటలు ఆలస్యమైంది. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. AI 2354 నెంబరు విమానం అది.
ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం 7.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరింది. బుధవారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. బ్యాంకాక్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఎయిరిండియా విమానం. ఒకొక్కరుగా వచ్చి తమ తమ సీట్లలో కూర్చొంటున్నారు.
విమానం రెక్కల మధ్య భాగంలో ఏదో ఉన్నట్లు ఓ ప్రయాణికుడు గమనించాడు. అనుమానంతో విండో దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. రెక్కల మధ్యలో ఓ పక్షి గూడుకి చెందిన ఎండు గడ్డి కనిపించింది. అందులో చిన్న కర్ర ఉండటాన్ని గమనించాడు. వెంటనే తన మొబైల్‌తో దాని షూట్ చేసి క్యాబిన్ సిబ్బందికి, ఎయిర్ హోస్టెస్‌కు చూపించాడు.
ALSO READ: పబ్ బీ పిచ్చి లవ్.. భర్త, కొడుకుని వదిలేసి లవర్‌తో
ప్రయాణికుడి సమాచారంతో ఎయిరిండియా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పైలట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ స్టాఫ్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. విమానం రెక్కల వద్ద పక్షి గూడును పరిశీలించాలని ఆదేశించాడు. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే తక్షణమే విమానం వద్దకు చేరుకుని రెక్కల మధ్య ఇరుక్కున్న పక్షి గూడు, చిన్న కర్రలు, ఎండుగడ్డి తొలగించారు.
విమానంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో అనేది పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుసుకున్న తర్వాత ప్రయాణానికి సిద్ధం చేశారు. దీనివల్ల విమానం మూడు నుంచి ఐదు గంటలు ఆలస్యంగా బ్యాంకాక్‌కు బయలుదేరింది. రెక్కలలో ఎలాంటి అడ్డంకులున్నా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.
చిన్న పక్షులు ఢీ కొట్టినా విమానాలు కూలిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. సిబ్బంది పక్షి గూడును మొత్తం తొలగించిన తర్వాత అప్పుడు బయలుదేరింది. దీనికారణంగా షెడ్యూల్ ప్రకారం విమానం బయలు దేరలేకపోయింది.
ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటన తర్వాత భద్రతా అంచనా వచ్చింది. ఢిల్లీ, ముంబైతోపాటు పలు విమానాశ్రయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. విమాన నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్లు, విమాన మౌలిక సదుపాయాల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడించిన విషయం తెల్సిందే.
Mumbai to Bangkok Air India Flight AI2354 Departure time 7:45am delayed to take off more than 3 hours. Ground staff are trying to remove a bird’s nest from inside the wing #aviation pic.twitter.com/Q0E1JVG724
— Ayaz Aziz (@aayaazzizz) June 25, 2025