BigTV English

Croatia in Quarter Finals : క్రొయేషియా కేక!

Croatia in Quarter Finals : క్రొయేషియా కేక!

Croatia in Quarter Finals : ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్‌లో జపాన్‌ భయపెట్టినా… ఒత్తిడిని అధిగమించి విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది. మూడు పెనాల్టీలను అడ్డుకున్న గోల్‌కీపర్‌ లివకోవిచ్‌… క్రొయేషియా హీరోగా నిలిచాడు.


ఆట ఆరంభం నుంచే జపాన్‌పై స్పష్టమైన అధిపత్యం ప్రదర్శించింది… క్రొయేషియా. అయితే తొలి అరగంటలోనే లభించిన రెండు గోల్ అవకాశాలు తప్పిపోయాయి. 8వ నిమిషంలో బాక్స్‌ సమీపానికి దూసుకొచ్చిన క్రొయేషియా ఆటగాడు ఇవాన్‌ పెర్సీచ్‌.. ప్రత్యర్థి డిఫెండర్‌ను బోల్తా కొట్టిస్తూ ముందుకెళ్లినా… ఫినిషింగ్‌లో విఫలమయ్యాడు. 28వ నిమిషంలో కార్నర్‌ నుంచి పెర్సీచ్‌ నేరుగా ఇచ్చిన క్రాస్‌ని క్రొయేషియా ఆటగాళ్లు గోల్ కొట్టలేకపోయారు. ఆ తర్వాత జపాన్‌ నెమ్మదిగా క్రొయేషియా గోల్ పోస్టులపై దాడులు మొదలెట్టింది. ఆ జట్టు ఆటగాళ్లు వ్యూహాత్మక పాస్‌లతో ప్రత్యర్థి గోల్‌ ప్రాంతంలోకి పదే పదే ప్రవేశించారు. ఫస్ట్ హాఫ్ కాసేపట్లో ముగుస్తుందనగా… 43వ నిమిషంలో డైజన్ గోల్ కొట్టడంతో… జపాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగం మొదలయ్యాక క్రొయేషియా దూకుడుగా ఆడింది. 55వ నిమిషంలో ఆ జట్టు అటగాడు పెర్సీచ్‌ గోల్ కొట్టాడు. మరో ఆటగాడి నుంచి ఫ్రీ కిక్‌ అందుకున్న పెర్సీచ్… హెడర్‌తో బంతిని నెట్‌లోకి పంపాడు. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు చెరో గోల్ వేసి స్కోరు 1-1గా నిలవడంతో, మ్యాచ్‌ అదనపు సమయానికి మళ్లింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో జపాన్‌ గోల్‌ చేసినంత పని చేసింది. గ్రౌండ్ మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మిటోమా… ఒక్కో డిఫెండర్‌ను తప్పిస్తూ 105వ నిమిషంలో ఓ బలమైన షాట్‌ కొట్టాడు. కానీ క్రొయేషియా కీపర్‌ లివకోవిచ్‌ దాన్ని సమర్థంగా అడ్డుకున్నాడు. జపాన్‌ ఆటగాళ్లు మరోసారి షాట్‌ కొట్టినా లివకోవిచ్ అడ్డుకున్నాడు. అదనపు సమయంలోనూ గోల్స్‌ పడకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్లో జపాన్ తొలి రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. క్రొయేషియా సఫలమై 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో షాట్‌కు జపాన్‌ గోల్‌ చేయగా.. క్రొయేషియా విఫలమైంది. నాలుగో ప్రయత్నంలో జపాన్‌ విఫలం కాగా.. క్రొయేషియా గోల్‌ కొట్టి 3-1 ఆధిక్యంలో నిలవడంతో… ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×