E-Paper
Advertisement

Yashoda OTT Release Date: ‘యశోద’ ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Yashoda OTT Release Date: ‘యశోద’ ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది
Advertisement

Yashoda OTT Release Date: స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’. న‌వంబ‌ర్ 11న సినిమా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైంది. మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 11న రిలీజైంది. మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ.30 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించింది. స‌మంత న‌ట‌నను అంద‌రూ అప్రిషియేట్ చేశారు. థియేటర్స్‌లో య‌శోద సినిమాను చూడాలేక‌పోయిన‌ సినీ ప్రేమికులు ఓటీటీ రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎద‌రు చూడ‌సాగారు. ఎట్ట‌కేల‌కు ‘యశోద’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. డిసెంబ‌ర్ 9న ఐదు భాష‌ల్లో ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో య‌శోద సినిమా స్ట్రీమింగ్ కానుంది.

నిజానికి ‘యశోద’ చిత్రాన్ని ఎప్పుడో ఓటీటీ రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే ఈ సినిమాలో ఈవా అనే స‌రోగ‌సీ సెంట‌ర్‌ను చూపించారు. నిజంగానే అదే పేరుతో ఉన్న స‌రోగ‌సీ సెంటర్ నిర్వాహ‌కులు సినిమాపై కేసు వేశారు. దీంతో మూవీ ఓటీటీ రిలీజ్ ఆగింది. చివ‌ర‌కు ఇటు య‌శోద మూవీ మేక‌ర్స్‌.. అటు స‌రోగ‌సీ సెంట‌ర్ నిర్వాహ‌కులు కూర్చుని మాట్లాడుకోవ‌టంతో విష‌యం సీరియ‌స్ కాకుండా ఆగింది.

Advertisement

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, ఉన్ని ముకుంద‌న్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌రోగ‌సీ సెంట‌ర్స్‌లో క్రైమ్ జ‌రిగితే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ సినిమాను నిర్మించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×