BigTV English

Aaryapriya Bhuyan: ఏంట్రా ఈ పిల్లకు ఇంత ఫాలోయింగ్ ఎందుకు

Aaryapriya Bhuyan: ఏంట్రా ఈ పిల్లకు ఇంత ఫాలోయింగ్ ఎందుకు

Aaryapriya Bhuyan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా మార్చ్ 31 తేదీన చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో చెన్నై పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుగానే వచ్చాడు. అలాగే ఒకప్పటి లాగానే ఒక సిక్స్, ఒక బౌండరీ బాదాడు.


 

దీంతో మ్యాచ్ నీ ధోని ఎలాగైనా గెలిపిస్తాడని అంతా భావించారు. కానీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ.. తన అద్భుత బౌలింగ్ తో ధోనీని బోల్తా కొట్టించాడు. చివరి ఓవర్ లో మొదటి బంతి వైడ్ కాగా.. రెండవ బంతి సిక్సర్ కొట్టే ప్రయత్నం చేసిన ధోని.. సిక్స్ గేట్ దగ్గర హిట్ మేయర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ధోని పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు.


అయితే ధోని అవుట్ కాగానే వెంటనే స్టేడియం మొత్తం సైలెంట్ గా మారింది. ఈ క్రమంలో ఓ ధోని లేడీ ఫ్యాన్ వింత రియాక్షన్స్ ఇస్తూ కెమెరాకు చిక్కింది. ఇంకేముంది.. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. సోషల్ మీడియా అనామకులను అందలం ఎక్కిస్తుంది. చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోతున్నారు. పేరుతోపాటు డబ్బు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరికొందరు ఒక్క వీడియోతో నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని అవుట్ అయిన అనంతరం ఈ లేడీ అభిమాని ఆర్య ప్రియ భూయాన్ అనే అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని అవుట్ అయిన సందర్భంగా కెమెరా కంటికి చిక్కిన ఈమె.. సోషల్ మీడియాలో ప్రముఖంగా నిలిచింది.

దీంతో రాత్రికి రాత్రి సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో 48 గంటల వ్యవధిలోనే వెయ్యి నుండి లక్షకు పైగా ఫాలోవర్లను దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. 19 ఏళ్ల ఈ అమ్మాయి నేషనల్ క్రష్ గా మారింది. మహేంద్ర సింగ్ ధోని డైహార్డ్ ఫ్యాన్ అయిన ఈ అమ్మాయి ఇచ్చిన ఒక్క ఎక్స్ప్రెషన్ టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచింది. ధోని అవుట్ అయిన అనంతరం పళ్ళు కొరుకుతూ, పిడికిలి బిగిస్తూ ధోనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఎక్స్ప్రెషన్స్ కెమెరాలలో కనిపించడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.

 

దీంతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించారు నెటిజెన్లు. చివరకు ఆమె సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి.. ఆ వివరాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫాలోవర్ల సంఖ్య సమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్ల సంఖ్య 3 లక్షల 70 వేలకు చేరింది. అయితే ఇప్పటివరకు ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కేవలం 12 పోస్టులు మాత్రమే పెట్టడం గమనార్హం. అయితే ఈ ఎక్స్ప్రెషన్ తో ఆమె పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే.. ప్రముఖ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గి ఇన్స్టా మార్ట్.. వారి ప్రచారకర్తగా వ్యవహరించాలని ఈమెను కోరేంత పాపులారిటీ దక్కింది. ఈ విషయాన్ని ఆర్య ప్రియ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Related News

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !

Sai Sudharsan: బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర బ‌ర్గ‌ర్ తింటున్న సాయి సుద‌ర్శ‌న్‌…టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

CSK Srinivasan: మ‌హిళ‌ల క్రికెట్ తో రూపాయి లాభం లేదు..వంటింట్లో రొట్టెలు చేసుకుంటే బెస్ట్‌!

SAW vs BanW: నేడు బంగ్లా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌..ఎవ‌రు గెలిచినా టీమిండియాకు ప్ర‌మాద‌మే, పాయింట్ల‌ ప‌ట్టికే త‌ల‌కిందులు

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Big Stories

×